అల్లుడు శీను వెరీ యావరేజ్‌

అల్లుడు శీను చిత్రంతో హీరోగా పరిచయం అవుతోన్న బెల్లంకొండ సురేష్‌ తనయుడు సాయి శ్రీనివాస్‌ చూడ్డానికి చాలా యావరేజ్‌గా ఉన్నాడు. ఫోటోషూట్స్‌లో బాగానే కవర్‌ చేసినా కానీ థియేట్రికల్‌ ట్రెయిలర్‌లో మాత్రం అతడిని అంత…

అల్లుడు శీను చిత్రంతో హీరోగా పరిచయం అవుతోన్న బెల్లంకొండ సురేష్‌ తనయుడు సాయి శ్రీనివాస్‌ చూడ్డానికి చాలా యావరేజ్‌గా ఉన్నాడు. ఫోటోషూట్స్‌లో బాగానే కవర్‌ చేసినా కానీ థియేట్రికల్‌ ట్రెయిలర్‌లో మాత్రం అతడిని అంత అందంగా చూపించలేకపోయారు. ఫస్ట్‌ లుక్స్‌ పరంగా యావరేజ్‌గా అనిపిస్తోన్న శ్రీనివాస్‌ కూడా ఈతరంలో చాలా మంది హీరోల్లానే మంచి డాన్సర్‌లా ఉన్నాడు.

ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్‌ ఎంత లావిష్‌గా నిర్మించాడనేది సాంగ్‌ సెట్స్‌ చూస్తేనే తెలుస్తోంది. వినాయక్‌ దర్శకుడు, సమంత హీరోయిన్‌… తమన్నా ఐటెమ్‌ సాంగ్‌ లాంటి హంగులన్నీ ఏ భారీ చిత్రాలకి తీసిపోనట్టు ఉన్నాయి. మరి ఈ హంగుల బ్యాకప్‌తో అల్లుడు శీను ఏమాత్రం లాక్కొస్తాడో చూడాలి. 

చూడ్డానికి వినాయక్‌ మార్కు రొటీన్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తోన్న ఈ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్‌ అయినా కానీ పెట్టిన ఖర్చు తిరిగొస్తుందా రాదా అనేది ట్రేడ్‌ కూడా ఎక్స్‌పెక్ట్‌ చేయలేకపోతోంది.