ఆయన వ్యసనం కెరీర్‌ని కబళించేసింది

ఎందుకో సినిమా వాళ్ళకు కొన్ని అలవాట్లు ఒక పట్టాన వదలవు. అది వ్యసనం అని వాళ్ళకూ తెలుసు. దానివల్ల పతనం వైపు వెళ్లిపోతామనీ తెలుసు. అయినా మొండి ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతారు. బ్లాక్‌ అండ్‌…

ఎందుకో సినిమా వాళ్ళకు కొన్ని అలవాట్లు ఒక పట్టాన వదలవు. అది వ్యసనం అని వాళ్ళకూ తెలుసు. దానివల్ల పతనం వైపు వెళ్లిపోతామనీ తెలుసు. అయినా మొండి ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలంలో స్టయిలిష్‌ హీరోగా పేరు తెచ్చుకున్న గొప్ప హీరో హరనాథ్‌ రాజు. తాగుడు కారణంగా తన గొప్ప కెరీర్‌ని చేతులారా పాడుచేసుకోవడం శోచనీయం. 

పశ్చిమగోదావరి జిల్లాలో 1936లో పుట్టిన వెంకట అప్పల హరనాథ్‌రాజు మొదట సినిమా ‘మా ఇంటి మహాలక్ష్మి’. ఎన్టీఆర్‌ తర్వాత శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా అతికినట్లు సరిపోయే హరనాథ్‌రాజు ‘సీతారామకళ్యాణం’, ‘భీష్మ’ సినిమాలో శ్రీకృష్నుడిగా మరిచిపోలేని పాత్రలు పోషించాడు. తన సినీ జీవితంలో కలిసి వుంటే కలదు సుఖం, మురళీకృష్ణ, పల్నాటియుద్ధం, భక్తప్రహ్లాద, కానాయిక మొల్ల, బాలభారతం, నాగు మొదలగు 34 చిత్రాల్లో నటించి, చెరగని ముద్ర వేశాడు. 

ఆనాటికే నాజూకైన కుర్రాడిగా అమ్మాయిలకు నిద్ర దూరం చేసిన హరనాథ్‌, కేవలం తాగుడు అనే వ్యసనంతో 53 ఏళ్ళకే చనిపోవడం దురదృష్టకరం. నటనలో, ఆహార్యంలో, డైలాగ్స్‌ చెప్పడంలో ఆనాటి ఏ హీరోకూ తగ్గని రీతిలో పేరు తెచ్చుకుని చేసిన అతి కొద్ది సినిమాల్లోనూ తెలుగువాళ్ళు మరిచిపోలేని పాత్రలు పోషించిన హరనాథ్‌రాజు లాంటి సొగసైన హీరో మరొకడు లేడని చెబుతారు సినీ పెద్దలు.