అతడే తెలుగు!

ఒక రోజు తెలుగు తన స్నేహితుడు ఒరియా ను వెంటబెట్టుకొని ఇంగ్లిషు దగ్గరికి వెళ్తాడు  .. తన మీద జరుగుతున్న దాడి ని ఎదుర్కోవాలని.. నిరోధించాలని గట్టి సంకల్పం తో బయలుదేరుతాడు Advertisement ……

ఒక రోజు తెలుగు తన స్నేహితుడు ఒరియా ను వెంటబెట్టుకొని ఇంగ్లిషు దగ్గరికి వెళ్తాడు  .. తన మీద జరుగుతున్న దాడి ని ఎదుర్కోవాలని.. నిరోధించాలని గట్టి సంకల్పం తో బయలుదేరుతాడు

... అక్కడేమో ఇంగ్లిషు తన పక్కనే కంప్యూటర్ ఇంజనీర్ ని పక్కన పెట్టుకొని చుట్ట కాలుస్తూ విలాపంగా జరిపిన సంభాషణ ..

xxxxxxxxxx

ఇంగ్లిషు : అదిగొ తెల్గు వస్తున్నాడు  చూడు, మన పవరు తెలిసినట్లు లేదు ..ఎన్నో భాషలను తొక్కిన చరిత్ర మనది..తను కాలుస్తున్న చుట్టను ఆర్పెస్తూ…

కంప్యూటర్ ఇంజనీర్: పొనీద్దు.. మధురమైన భాష కదా ,.. ఆ మాత్రం ఆక్రోశం వుంటుంది 

తెలుగు: చూడండి ఇంగ్లుషు గారు, మీరు చేస్తున్నది ఏమి బాగా లేదు 

ఇంగ్లిషు: ఓహ్! నిజమే పూర్వం ఒక పెట్టె కాల్చే వాడిని ..ఇప్పుడు బాగా తగ్గించా!

తెలుగు: అబ్బే నేను చుట్ట గురించి మాట్లాడడం లేదు, మీరు నా ప్రజల మీద సాగిస్తున్న భాష దాడి గురించి మాట్లాడడానికి వచ్చా..

ఇంగ్లిషు: ఏమి చేయమంటావు, మీ ప్రజలే నేనంటే ఇష్ట పడుతున్నారు, నన్ను చదివితేనే గౌరవిస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు ..ప్రపంచమంతా విజ్ఞానం నా తోనే నడుస్తున్నది 

తెలుగు: ఏమండి కంపూటర్ ఇంజనీరు గారు, మీరైనా ఈ దాడిని ఆపండి .. ఈ విషయం లో మీరేమైనా చేయగలరా? 

కంప్యూటర్ ఇంజినీరు: చూడండి తెలుగు, మీరు ఇలా గొడవ చేయడం బాగా లేదు ..మీకు భాధ అనిపిస్తే కోర్టు లో కేసు వేయండి సివిల్ కేసు అవుతుంది ..కాని ఇలా గొడవ చేస్తే క్రిమినల్ కేసు అవుతుంది ..ఛీ నీచుడైన ఇంగిషు తో పెట్టుకోవడం ఎందుకు అని వదిలేస్తే గొడవ వదిలిపోతుంది 

ఇంగిషు: పాత కాలపు ఛందస్సు, వ్యాకరణం, ప్రాస ఇవన్ని దేనికి పనికి వస్తాయి .. ఇంకా వాటిని పట్టుకొని వేలాడితే వచ్చేది చేతికి చిప్పే ..

ఒరియా: ఇంగిషు,  నిప్పుతో జాతీయ ఆట అడుతున్నావు ..మసై పోతావ్ 

తెలుగు: (తన చేతోలో వున్న తుపాకి ని కంప్యూటర్ ఇంజినీర్ పక్కన గురిపెట్టి కాలుస్తూ) .. ఇదేమి బాగాలేదు, తెలుగు అభివృద్ధి కి సహాయం చెయ్యక పోతే పరవాలేదు, కాని ఇలా దగ్గరుండి అంత్య క్రియలు జరిపించడము ఏమి బాగా లేదు.

కంప్యూటర్ ఇంజినీరు: (గజ గజ వణుకుతూ…) నేను ఏమి చేస్తాను ..ప్రజలకు ఇంగ్లిషు అంటేనే మక్కువ .. బ్రతికి వుంటే మళ్లీ కలుస్తా ఇంగ్లిషు గారు ..   అంటూ పరిగెత్తి పోతాడు ..

ఇంగ్లిషు: (ఆందోళనతో కూడిన ఆశ్చర్యం తో చేష్టలుడిగి.మౌనం గా తెలుగు పెట్టిన తుపాకి వైపు చూస్తుండగా) 

తెలుగు: భాద, కసి కలిగినప్పుడు తిరగబడితే అంతర్యుద్ధమే .. జాగ్రత్త గా మసలుకో అంటూ హెచ్చరించి అక్కడినుండి వెళ్ళిపోతాడు ..  

xxxxxxxxx

(ఇంగిషు తన స్నేహితులు జావా, సాప్, ఒరాకిల్ తో కలిసి అంతర్మదనం సాగితున్న సమయం..) 

ఇంగ్లిషు: ఆడు మగాడురా బుజ్జి .. ఏదో మొక్కకు అంటు కడుతున్నట్టు చాల శ్రద్ధ గా బెదిరించాడు రా ..

ఇంగ్లిషు: ఆడు మగాడురా బుజ్జి .. 

జావా: చస్ .. ఆడు మగాడు అయితే మేము మాడగాల్లమా? ..ఇసారి తొక్కితే ఇంక ఉనికే వుండకూడదు .. నేను, ఒరాకిల్ కొత్త వెర్షన్ విడుదల చేస్తాం .. చిన్న పిల్లలకి కూడా స్కూల్ లో పుస్తకాలకు బదులు పూర్తిగా కంప్యూటర్ పెట్టేటట్టు మారుస్తాం ..అక్కడ దొరకక పోతే ప్రజల కొత్త సేవలు, ప్రతి అడుగులో కనపడేటట్టు ఆకర్షనీయం గా ప్రకటనలు పెడదాం .. ప్రజలు తెలుగు ని పూర్తి గా మరిచి పోవాలి .. 

ఇంగ్లిషు: ఆపరా .. ఎందుకంత ఖర్చు ..  చేసేది సైలెంట్ గా చేయాలి ..జింక ని పులి వేటాడేటప్పుడు ఎంత నిగ్రహం గా వుంటుంది .. అట్టాగ మనం చేసే పని ఎంత సైలెంట్ గా వుంటే దాని ప్రభావం అంత వైలెంట్ గా వుంటుంది …

xxxxxxxxxx

ఇలా మనకు తెలియకుండా మన భాష మృత్యువు ని మరొకరు నిర్వచిస్తున్నారు .. మనం వాటిని తెలుసుకొని మన భాష ను కాపాడుకోవాలి ..తెలుగు చదవండి, మాట్లాడండి, రాయండి .. నేర్పించండి!

రంగ ఓంకారం