గంగపుత్రులు అనే మంచి సినిమా తీస్తే ఎవరూ చూడలేదు. దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డికి కోపం వచ్చింది. ఒక రొమాంటిక్ క్రైమ్ స్టోరీ అనే బూతు దట్టించిన సినిమా చూస్తే జనం ఎగబడ్డారు. అందుకే మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. మిస్ లీలావతి అనే సినిమా తీసేస్తున్నాడు.
Advertisement
దీనికి హుద్ హుద్, ప్రకృతి, మానవుడు ఇత్యాది వ్యవహారాల గురించి చెబుతున్నాడు కానీ, లీలావతి కేలండర్ అంటూ విడుదల చేసిన బొమ్మలు కానీ ఆ తరువాతి స్టిల్స్ కానీ కింగ్ ఫిషర్ క్యాలెండర్ అంత కాకున్నా దాదాపు అదే రేంజ్ లో వున్నాయి. ప్రేక్షకుల గుండెల్లో హుద్ హుద్ సృష్టించాలనుకుంటుంన్నట్లుంది సునీల్ కుమార్ రెడ్డి.