బాహుబలి డబ్బులతో భలే జోరు

డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చాయంటే కాస్త హుషారుగానే వుంటుంది. వచ్చిన రూట్ లోనే మరింత జోరుగా వెళ్లాలనే వుంటుంది. బాహుబలి సినిమాను కర్ణాటకకు కొన్న శ్రీనివాస్ అనే పెద్దాయిన వైనం ఇలాగే వుంది. మారు…

డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చాయంటే కాస్త హుషారుగానే వుంటుంది. వచ్చిన రూట్ లోనే మరింత జోరుగా వెళ్లాలనే వుంటుంది. బాహుబలి సినిమాను కర్ణాటకకు కొన్న శ్రీనివాస్ అనే పెద్దాయిన వైనం ఇలాగే వుంది. మారు బేరానికి 16 కోట్లుకు కొన్నాడు ఆయన కర్ణాటకకు బాహుబలి హక్కులను. ఆ సినిమా కొన్నప్పుడు జనం ఆయనను పిచ్చోడిని చూసినట్లు చూసారు. 

ఓ తెలుగు సినిమాను కర్ణాటకకు 16 కోట్లకు కొనడమా అని.  కానీ ఆ సినిమా అక్కడ కాసుల వర్షం కాదు, సునామీనే సృష్టించింది. దాంతో ఇప్పుడు ఆయనకు తన జాతకం మీద, లక్ మీద అపార నమ్మకం కుదరిపోయినట్లుంది. ఆ డబ్బులను ఓ రేంజ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆంధ్రకు వచ్చి రుద్రమదేవి సినిమా అమ్మగా మిగిలిన ఏరియాలన్నీ కోనేసాడని వినికిడి. అంతే కాదు, రుద్రమదేవి హిందీ వెర్షన్ కూడా తీసుకున్నాడని టాక్. 

సరే, రుద్రమదేవి అంటే కాస్త ఆసక్తి వున్న సినిమా అందుకు కొనేసి వుంటారు అనుకుందాం. రెండు రోజులకు ముందు ఆంధ్రకు వచ్చి, ఉపేంద్ర 2 సినిమా ఎవరూ తీసుకోలేదని తెలిసి, మొత్తం రైట్స్ తీసుకున్నారట. ఆయన స్టార్, ఈ సినిమాలకు కూడా కలిసి వస్తే, ఉభయులకు మంచిదే.