ఎవడు లో ఏ వంశీ బెటర్?

రామ్ చరణ్ ఎవడు కమర్షియల్ గా పాజిటివ్ రిపోర్టు తెచ్చకుంది. ఓకె.అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన డిస్కషన్ మొదలైంది టాలీవుడ్ లో. ఈ సినిమాకు కథ వక్కతం వంశీ. ఇంప్రూవ్ మెంట్…

రామ్ చరణ్ ఎవడు కమర్షియల్ గా పాజిటివ్ రిపోర్టు తెచ్చకుంది. ఓకె.అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన డిస్కషన్ మొదలైంది టాలీవుడ్ లో. ఈ సినిమాకు కథ వక్కతం వంశీ. ఇంప్రూవ్ మెంట్ కు తలా చేయి వేసారు అది వేరే సంగతి. కానీ స్క్రీన్ ప్లే మాత్రం వంశీ పైడిపల్లిది?  తీరా సినిమా చూసాక, కాస్త చూడబుల్ గా వుందీ అంటే అధి కథ వల్ల కాదు..స్క్రీన్ ప్లే వల్ల అని అర్థమైపోయింది. కథలో రెండు విషయాలున్నాయి..ఒకటి ఫేస్ ఆప్ నుంచి ఎత్తుకొచ్చింది. రెండవది.. చిరంజీవి ముఠామేస్త్రి నుంచి రాజశేఖర్, బాలకృష్ణ,. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వరకు చేసేసిన పేదల కాలనీ లేదా మార్కెట్, దానిపై విలన్ కన్నేయడం అన్న డామ్ ఓల్డ్ ఫ్లాట్.

ఇప్పుడు సినిమా చూసిన టాలీవుడ్ ప్రముఖ దర్శకులు చాలా మంది లోపాయికారీగా ఇదే అంటున్నారు. భిన్మమైన స్క్రీన్ ప్లా వాడి, ఫాథటిక్ సాంగ్ తో సినిమా ప్రారంభించడం, హీరో సోలో సాంగ్ ఇంటర్వెల్ తరువాత రావడం, హీరో అవుట్ అండ్ అవుట్ సీరియస్ లుక్ తో వుండడం, సినిమా తొలిసగంలో పాత్రలను మలి సగంలోకి తేకుండా వదిలేయడం, ఇలా సాంప్రదాయేతర స్క్రీన్ ప్లే రాసి, ప్రేక్షకులను సినిమా చూసేలా చేయగలిగిన దర్శకుడు సెకండాఫ్ కథ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎందుకు కాస్త వైవిధ్యంగా వెళ్లే ప్రయత్నం చేయలేదా అని?

అంటే అప్పుడు వేళ్లన్నీ వక్కతం వంశీ వైపు చూపిస్తున్నాయి. అవును ఇంతకీ ఇలాంటి పాతకథలనే చెప్పి వక్కతం ఎన్నాళ్లు నెట్టుకొస్తాడో? ఇలాంటి కథ చెప్పినందుకనే ఎన్టీఆర్ తో సినిమా ఆగిపోయింది అని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి.