న‌య‌న హూ… హా..

న‌య‌న‌తార కొత్త త‌ర‌హా పాత్రల కోసం అన్వేషిస్తోంది. నాలుగుపాట‌లు, రెండు ముద్దు సీన్లు,కాస్త  గ్లామ‌ర్ మిక్స్ చేసిన హీరోయిన్ పాత్రల‌కు న‌య‌న తూచ్ చెప్పేస్తోంది. చేస్తున్న పాత్రలో కాస్తయినా కొత్తద‌నం ఉండాలి అనేది న‌య‌న…

న‌య‌న‌తార కొత్త త‌ర‌హా పాత్రల కోసం అన్వేషిస్తోంది. నాలుగుపాట‌లు, రెండు ముద్దు సీన్లు,కాస్త  గ్లామ‌ర్ మిక్స్ చేసిన హీరోయిన్ పాత్రల‌కు న‌య‌న తూచ్ చెప్పేస్తోంది. చేస్తున్న పాత్రలో కాస్తయినా కొత్తద‌నం ఉండాలి అనేది న‌య‌న కొత్త కండీష‌న్. 

అలాంటి పాత్రనే ఓ త‌మిళ సినిమా కోసం ఎంచుకొంది న‌య‌న‌తార‌. ప్రస్తుతం జ‌యం ర‌వితో ఓ సినిమాలో న‌టిస్తోంది. ఇందులో న‌య‌న క‌రాటే మాస్టర్‌గా క‌నిపిస్తుంద‌ట‌. హూ… హా అంటూ ఫైటింగులు చేస్తుంద‌ట‌. 

అందుకోసం ప్రత్యేకంగా ఓ శిక్షకుడిని నియ‌మించుకొని క‌స‌ర‌త్తులు మొద‌లెట్టేసింది న‌య‌న‌. రోజుని నాలుగైదు గంట‌లు ఆ ట్యూట‌ర్‌తోనే గ‌డుపుతోంద‌ట‌. ఇక మీద‌ట కూడా ఇలాంటి క‌ఠిన మైన పాత్రల‌నే ఎంచుకొంటా.. అంటోంద‌ట‌. న‌య‌న గ్లామ‌ర్ పాత్రల‌కు పూర్తిగా దూర‌మైపోతే.. కుర్రకారు ఏమైపోతారో??