నయనతార కొత్త తరహా పాత్రల కోసం అన్వేషిస్తోంది. నాలుగుపాటలు, రెండు ముద్దు సీన్లు,కాస్త గ్లామర్ మిక్స్ చేసిన హీరోయిన్ పాత్రలకు నయన తూచ్ చెప్పేస్తోంది. చేస్తున్న పాత్రలో కాస్తయినా కొత్తదనం ఉండాలి అనేది నయన కొత్త కండీషన్.
అలాంటి పాత్రనే ఓ తమిళ సినిమా కోసం ఎంచుకొంది నయనతార. ప్రస్తుతం జయం రవితో ఓ సినిమాలో నటిస్తోంది. ఇందులో నయన కరాటే మాస్టర్‌గా కనిపిస్తుందట. హూ… హా అంటూ ఫైటింగులు చేస్తుందట.
అందుకోసం ప్రత్యేకంగా ఓ శిక్షకుడిని నియమించుకొని కసరత్తులు మొదలెట్టేసింది నయన. రోజుని నాలుగైదు గంటలు ఆ ట్యూటర్తోనే గడుపుతోందట. ఇక మీదట కూడా ఇలాంటి కఠిన మైన పాత్రలనే ఎంచుకొంటా.. అంటోందట. నయన గ్లామర్ పాత్రలకు పూర్తిగా దూరమైపోతే.. కుర్రకారు ఏమైపోతారో??