తరుణ్‌ రగడ.. జర్నలిస్ట్‌ రాజీనామా

తెహెల్కా మాజీ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ కారణంగా లైంగిక వేధింపులకు గురైన జర్నలిస్ట్‌, తెహల్కా సంస్థకు రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో తరుణ్‌ తేజ్‌పాల్‌ అరెస్టుకి రంగం సిద్ధమయ్యింది.…

తెహెల్కా మాజీ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ కారణంగా లైంగిక వేధింపులకు గురైన జర్నలిస్ట్‌, తెహల్కా సంస్థకు రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో తరుణ్‌ తేజ్‌పాల్‌ అరెస్టుకి రంగం సిద్ధమయ్యింది. ఇది తెలుసుకుని, తరుణ్‌ బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.

మరోపక్క, తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ తేజ్‌పాల్‌పై కేసు పెట్టిన జర్నలిస్ట్‌, ఇకపై తాను తెహెల్కాలో పని చేయలేనంటూ రాజీనామా లేఖను మేనేజ్‌మెంట్‌కి పంపారు. తరుణ్‌ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ బాధితురాలు పోలీసులకు ఇంకో ఫిర్యాదు చేయడం గమనార్హం. 

అయితే తరుణ్‌ మాత్రం, తాను అమాయకుడిననీ, తనపై ఎవరో కుట్ర పన్నారనీ, ఆ కుట్రలో తాను బలి పశువునైపోతున్నాననీ వాపోతున్నారు. తెహెల్కా అంటే మీడియా రంగంలో సంచలనం.. అనేంతగా తెహెల్కాను పాపులర్‌ చేసిన తరుణ్‌ తేజ్‌పాల్‌, తనతో పనిచేసే జర్నలిస్ట్‌ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారన్న వార్త.. మొత్తం మీడియా రంగంలో కలకలం రేపింది.