నో మేకప్ నాగచైతన్య

తండేల్.. ఈ సినిమా కోసం నాగచైతన్య పూర్తిస్థాయిలో మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించి ఇప్పటికే గ్లింప్స్ కూడా రిలీజైంది. తండేల్ ప్రపంచాన్ని అందులో పరిచయం చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి…

తండేల్.. ఈ సినిమా కోసం నాగచైతన్య పూర్తిస్థాయిలో మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించి ఇప్పటికే గ్లింప్స్ కూడా రిలీజైంది. తండేల్ ప్రపంచాన్ని అందులో పరిచయం చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ వదిలారు.

తండేల్ సినిమాకు సంబంధించి కీలకమైన షెడ్యూల్ పూర్తిచేశారు. ఉడిపి పరిసర ప్రాంతాల్లో దాదాపు 45 రోజుల పాటు జరిగిన ఈ షూటింగ్ లో కీలకమైన సన్నివేశాలతో పాటు, యాక్షన్ సీన్స్ కూడా తీశారు. వీటికి సంబంధించి విడుదల చేసిన వర్కింగ్ స్టిల్స్ లో మేకప్ లేకుండా కనిపించాడు నాగచైతన్య. సినిమాలో చాలా భాగం అతడు మేకప్ లేకుండానే కనిపించేలా ఉన్నాడు.

చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి స్వల్ప విరామం ఇవ్వబోతున్నారు. ఈ నెల్లోనే మరో షెడ్యూల్ ఉంటుంది. సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

యదార్థ ఘటనల ఆధారంగా తండేల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీకాకుళం యాసలో మాట్లాడబోతున్నాడు నాగచైతన్య. దీని కోసం ఆల్రెడీ అతడు కొంత ప్రాక్టీస్ చేశాడు. గీతాఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అల్లు అరవింద్ ప్రజెంటర్.