అంబాజీపేట – నమ్మకం నిజమైంది

ఈ ఇయర్ బిగినింగ్ లోనే టాలీవుడ్ కు మరో మంచి సినిమాగా వచ్చింది “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా. విడుదలైన అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తున్న “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా…

ఈ ఇయర్ బిగినింగ్ లోనే టాలీవుడ్ కు మరో మంచి సినిమాగా వచ్చింది “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా. విడుదలైన అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తున్న “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ శివాని మాట్లాడుతూ – మా ప్రొడ్యూసర్ ధీరజ్ కి కంగ్రాట్స్. ఆయన ఇలాంటి మరెన్నో సక్సెస్ లు అందుకోవాలి. అమ్మా నాన్న తర్వాత నేను రుణపడి ఉండేది మా డైరెక్టర్ దుశ్యంత్ కే. ఆయన నన్ను హిట్ సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేశారు. సుహాస్ వల్లే ఇవాళ ఇలాంటి మంచి సినిమా వచ్చింది. మా సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.

డైరెక్టర్ దుశ్యంత్ మాట్లాడుతూ – ఇలాంటి కథలు రాయడంతోనే సరిపోదు ప్రొడ్యూస్ చేసే ధైర్యం గల వాళ్లు కావాలి. గీతా ఆర్ట్స్, ధీరజ్ , బన్నీ వాస్ ఆ ధైర్యం చేశారు. ప్రొడ్యూసర్స్ తో పాటు కథను నమ్మిన హీరో సుహాస్ కు థ్యాంక్స్. ఇది అహంకారానికి, ఆత్మాభిమానికి మధ్య జరిగే కథ. సిస్టర్స్ ఉన్న ఆడియెన్స్ అయితే ఎమోషనల్ అవుతున్నారు. మా సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. సుహాస్, శివాని, నితిన్, శరణ్య తో పాటు మేకింగ్ లో సపోర్ట్ గా ఉన్న టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.

ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా ఒప్పుకునే టైమ్ కు నేను కో ప్రొడ్యూస్ చేసిన డీజే టిల్లు, బేబి మూవీస్ హిట్ అయ్యాయి. అంత పెద్ద సినిమాలు చేసిన నువ్వు ఈ సినిమా ఎందుకు చేస్తున్నావు అని కొందరు అడిగారు. అవి వేరే జానర్ మూవీస్.. ఈ సినిమా జానర్ వేరు అని చెప్పా. నా దృష్టిలో “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఒక జెన్యూన్ మూవీ. ఈ కథ విన్నప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగింది. కొందరు స్టార్ హీరోను తీసుకో అని చెప్పినా..నేను సుహాస్ అయితేనే ఈ కథకు కరెక్ట్ అని నమ్మాను. చాలా మంది కొత్త వాళ్లకు మేము ఒక ప్లాట్ ఫామ్ ఇచ్చామనే సంతృప్తి ఏర్పడింది అన్నారు.

హీరో సుహాస్ మాట్లాడుతూ – నాకు హ్యాట్రిక్ ఇచ్చిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. నన్ను నమ్మి థియేటర్స్ కు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. సినిమా రిలీజ్ ముందే నేను, ధీరజ్ అనుకున్నాం ఈ సినిమాతో హిట్ కొడుతున్నామని. ఇవాళ ఆ మాట నిజమైనందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో హీరోతో పాటు మిగతా క్యారెక్టర్స్ కు ఇంపార్టెన్స్ ఉంది. అదే ఈ స్క్రిప్ట్ లో ఉన్న స్ట్రెంత్. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”కు పనిచేసిన ప్రతి ఒక టీమ్ మెంబర్ కు థ్యాంక్స్ చెబుతున్నా అన్నారు.