చేతి నిండా సినిమాలతో, భారీ రెమ్యూనిరేషన్ ఒప్పందాలతో బిజీగా ఉన్న కియరా అద్వానీ ఇంత బిజీలోనూ కాస్త గ్యాప్ తీసుకుని ప్రేమ కథనూ సాగిస్తున్నట్టుగా ఉంది. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ఈమె ప్రేమలో ఉందనే ప్రచారం పాతదే.
అయితే వీరిద్దరూ తమ ప్రేమబంధాన్ని ధ్రువీకరించలేదు. ఇండస్ట్రీలో సిద్ధార్థ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని కియరా గతంలో స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇలాంటి ఆమె అత్యంత సన్నిహితుడితో ఆమె ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతోంది.
వీరిద్దరూ ఒక సినిమా షూటింగ్ లో భాగంగా ఏడాది పాటు సన్నిహితంగా గడిపారనే ప్రచారమూ సాగింది. ఆ సంగతలా ఉంటే.. వీరిద్దరూ విడిపోయారని, బ్రేకప్ అనే ప్రచారం రెండు మూడు రోజుల నుంచి జరుగుతూ ఉంది.
ఈ రోజుల్లో ప్రేమికులు పరస్పరం ఎందుకు బోర్ కొడతారో అర్థం కాదు, ఇదే తరహాలో కియరా, సిద్ధార్థ్ లు కూడా విడిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి చెక్ పెట్టే తరహాలో మీడియాను కన్ఫ్యూజ్ చేసేలా కియరా ఇన్ స్టా పోస్టుకు సిద్ధార్థ్ లైక్ కొట్టాడు. ఆమె ఫ్యాషన్ ఫోటో షూట్ కు ఇన్ స్టా లో లవ్ సింబల్ ను ప్రెస్ చేశాడు సిద్ధార్థ్!
ఈ రోజుల్లో సెలబ్రిటీల మధ్యన అనుబంధం ఎలా ఉందనేందుకు వారి ఇన్ స్టా పోస్టుల పరస్పర స్పందనలే పెద్ద ఆధారం. ఇలాంటి నేపథ్యంలో.. కియరా, సిద్ధార్థ్ బ్రేక్ ఊహాగానాలకు ఆమె ఇన్ స్టా పోస్టును అతడు లైక్ చేయడం ట్విస్ట్ గా మారింది!