ఫైటర్ వసూళ్లు.. ఆ ముగ్గురి రెమ్యూనరేషన్లు

సినిమా బడ్జెట్ పెరిగిపోయింది. అందులో అధిక భాగం నటీనటుల పారితోషికాలకే పోతోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరుకు బడా సినిమాల పరిస్థితి ఇదే. రిజల్ట్ ఏమాత్రం తేడా కొట్టినా పారితోషికాల కోసం చెల్లించిన మొత్తం…

సినిమా బడ్జెట్ పెరిగిపోయింది. అందులో అధిక భాగం నటీనటుల పారితోషికాలకే పోతోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరుకు బడా సినిమాల పరిస్థితి ఇదే. రిజల్ట్ ఏమాత్రం తేడా కొట్టినా పారితోషికాల కోసం చెల్లించిన మొత్తం కూడా వెనక్కు రావడం కష్టంగా మారుతోంది.

సరిగ్గా ఇలాంటి సందర్భమే ఫైటర్ సినిమాది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమా నిన్నట్నుంచి పూర్తిస్థాయిలో చతికిలపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు ఇండియాలో 126 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు వచ్చాయి.

ఈ వసూళ్లు, సినిమాలో నటించిన ముగ్గురు కీలక పాత్రధారుల పారితోషికాలతో సమానం అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ పడుతున్నాయి.

ఫైటర్ సినిమాకు హృతిక్ రోషన్ 85 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నాడట. ఇక దీపిక పదుకోన్ రూ.20 కోట్లు, కీలక పాత్ర పోషించిన అనీల్ కపూర్ రూ.15 కోట్లు ఛార్జ్ చేశారట. వీళ్ల ముగ్గురి పారితోషికాల మొత్తం ఎంతో తాజాగా వచ్చిన వసూళ్లు అంతే అంటూ సెటైర్లు పడుతున్నాయి.

రిపబ్లిక్ డే సీజన్ లో భారీగా ఓపెన్ అయిన ఈ సినిమా, ఇండియాలో 200 కోట్ల రూపాయల నెట్ సాధిస్తుందని అంతా అంచనా వేశారు. కానీ ఇప్పుడిది 150 కోట్లు కలెక్ట్ చేయడం కూడా కష్టం అంటున్నారు. అటు మిడిల్ ఈస్ట్ లో నిషేధం విధించడం ఫైటర్ కు మరో పెద్ద దెబ్బ.