మరో హీరోయిన్ పెళ్లి.. ప్రియుడు మామూలోడు కాదు

కొత్త ఏడాదిలో మరో సెలబ్రిటీ జంట పెళ్లికి సిద్ధమైంది. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న హీరోయిన్ కృతి కర్బందా, నటుడు పుల్కిత్ సామ్రాట్ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి తొలి అంకాన్ని వీళ్లు పూర్తిచేసినట్టు…

కొత్త ఏడాదిలో మరో సెలబ్రిటీ జంట పెళ్లికి సిద్ధమైంది. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న హీరోయిన్ కృతి కర్బందా, నటుడు పుల్కిత్ సామ్రాట్ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి తొలి అంకాన్ని వీళ్లు పూర్తిచేసినట్టు కనిపిస్తోంది.

కృతి కర్బందా, పుల్కిత్ తాజాగా కొన్ని ఫొటోలు రిలీజ్ చేశారు. ఓ సెలబ్రేషన్ లో వాళ్లు ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నాయి ఆ ఫొటోలు. అంతేకాదు, ఆ పిక్స్ లో ఇద్దరి చేతులకు నిశ్చితార్థం ఉంగరాలు ఉన్నాయి. సో.. తామిద్దరం ఎంగేజ్ మెంట్ చేసుకున్నామనే విషయాన్ని వీళ్లు ఇలా పరోక్షంగా బయటపెట్టారు.

నాలుగేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు కృతి కర్బందా, పుల్కిత్. ఓ ఏడాది కిందట తమ రిలేషన్ షిప్ ను వీళ్లు బయటపెట్టారు. అప్పట్నుంచి వాళ్ల పెళ్లిపై పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. కొత్త ఏడాదిలో పెళ్లి చేసుకుంటారంటూ ఊహాగానాలు వచ్చాయి. అవే ఇప్పుడు నిజమయ్యాయి.

గతంలో సల్మాన్ ఖాన్ సోదరిని పెళ్లాడాడు పుల్కిత్. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట, 2015లో విడిపోయింది. దీనికి కారణం యామీ గౌతమ్. ఆమెకు క్లోజ్ గా ఉంటున్నాడనే కారణంతో సల్మాన్ సోదరి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత పుల్కిత్, యామీ నాలుగేళ్లు కలిసున్నారు. కానీ 2018లో పుల్కిత్ కు దూరమైంది యామి.

ఆ తర్వాత 2019లో కృతి కర్బాందాకు కనెక్ట్ అయ్యాడు పుల్కిత్. రెండేళ్లు ప్రేమించుకున్న ఈ జంట, ఆ తర్వాత ఏకంగా సహజీవనం మొదలుపెట్టినట్టు టాక్. ఇప్పుడు తమ సహజీవనాన్ని పెళ్లితో అధికారికం చేసుకోబోతోంది ఈ జోడీ.