ఓజీ సినిమా విడుదల తేదీని ఘనంగా ప్రకటించారు. పవన్ సంగతి తెలిసి కూడా ఈ విషయంలో మేకర్స్ చాలా పెద్ద రిస్క్ చేశారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయింది. మిగతా భాగం షూటింగ్ కోసం పవన్ కేవలం 20 రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుంది. ఆ నమ్మకంతోనే ఓజీ సినిమాకు విడుదల తేదీ ఎనౌన్స్ చేశారు.
అయితే ఇప్పుడా తేదీకి పవన్ సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. రామ్ చరణ్ తాజా స్టేట్ మెంట్ తో ఓజీ విడుదలపై అనుమానాలు పెరుగుతున్నాయి.
రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో తను చేస్తున్న గేమ్ ఛేంజర్ విడుదల తేదీని చెప్పేశాడు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఆ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందన్నాడు. అంటే దీనర్థం.. దసరాకు ముందే గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుందని.
అదే కనుక జరిగితే ఆల్రెడీ అక్టోబర్ 10కి దేవర పార్ట్-1 ఉంది కాబట్టి.. అంతకంటే ముందే గేమ్ చేంజర్ ను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. పోటీని దృష్టిలో పెట్టుకొని 2 వారాలు వెనక్కు వెళ్తే, అక్కడ ఓజీ ఉంది. సో.. రామ్ చరణ్ ప్రకటన బట్టి చూసుకుంటే.. ఓజీ విడుదల తేదీకి గేమ్ ఛేంజర్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఓజీ కంటే 2 వారాల ముందు గేమ్ ఛేంజర్ ను విడుదలకు సిద్ధం చేయలేకపోవచ్చు. ఎందుకంటే అక్కడున్నది శంకర్. సో.. ఓజీ తేదీకి రాకూడదు అనుకుంటే, దేవర-1 విడుదలైన 2 వారాల తర్వాత రావాల్సి ఉంటుంది. అంటే అక్టోబర్ చివరి వారంలో అన్నమాట. అదే జరిగితే బంగారం లాంటి దసరా హాలిడేస్ సీజన్ ను మిస్సవుతాడు చరణ్.
సో.. ఎలా చూసుకున్నా, గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉన్న తేదీ ఓజీ రిలీజ్ డేట్ మాత్రమే. సెప్టెంబర్ 27కి ఓజీ రిలీజ్ ఉందని తెలిసి కూడా చరణ్ ఈ ప్రకటన చేశాడంటే, దానర్థం పవన్ సినిమా దాదాపు వాయిదా పడినట్టే. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది.