రాజ్ తరుణ్ కు మేటర్ లేదా.. లావణ్య ఏమంటోంది

ఊహించని విధంగా రాజ్ తరుణ్ కు సంబంధించి ఓ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఓ అమ్మాయి ముఖానికి చున్నీ కట్టుకొని కెమెరా ముందుకొచ్చింది. రాజ్ తరుణ్ కు మేటర్ లేదంటూ బహిరంగంగా…

ఊహించని విధంగా రాజ్ తరుణ్ కు సంబంధించి ఓ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఓ అమ్మాయి ముఖానికి చున్నీ కట్టుకొని కెమెరా ముందుకొచ్చింది. రాజ్ తరుణ్ కు మేటర్ లేదంటూ బహిరంగంగా ఆరోపించింది.

దీంతో ఇదేదో రాజ్-లావణ్య వివాదానికి సంబంధించిన వీడియో అని చాలామంది అనుకున్నారు. కట్ చేస్తే, అది రాజ్ కొత్త సినిమా కోసం చేసిన ప్రచారపు ఎత్తుగడ అని తెలిసి జనాలు ముక్కున వేలేసుకున్నారు.

ఈ వీడియో లావణ్య కూడా చూసింది. దీనిపై ఆమె ఘాటుగా స్పందించింది. పలు అనుమానాలు కూడా వ్యక్తం చేసింది.

“మూవీ ప్రమోషన్ కోసం ఇలా దిగజారుతారని అనుకోలేదు. దీన్ని రాజ్ తరుణ్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడో అర్థంకాలేదు. రాజ్ తరుణ్ కు మేటర్ లేదంటూ వచ్చిన వీడియో చూడగానే, ఇదేదో నా గర్భం-అబార్షన్ కు సంబంధించిన కేసును తప్పుదోవ పట్టించడానికి రిలీజ్ చేసిన వీడియో అనుకున్నాను.”

ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత చాలామంది కాల్స్ చేసి తనను తిడుతున్నారని, సదరు వీడియోకు తనకు సంబంధం లేదని మొత్తుకుంటున్నా వినిపించుకోవడం లేదని బాధపడింది లావణ్య. తనను ఇలా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని, తన ఉసురు తగిలి ఈ సినిమా కూడా పోతుందని శాపనార్థాలు పెట్టిందామె.

గతంలో నరేష్-పవిత్ర విషయంలో కూడా ఇలానే జరిగింది. తన కొత్త సినిమా ప్రచారం కోసం, నిజజీవితంలో జరుగుతున్న వివాదాన్ని వాడుకున్నారు నరేష్. సరిగ్గా అదే ఎత్తుగడను రాజ్ తరుణ్ నటిస్తున్న ‘భలే ఉన్నాడే’ అనే సినిమా యూనిట్ కూడా ఫాలో అవుతోంది.

10 Replies to “రాజ్ తరుణ్ కు మేటర్ లేదా.. లావణ్య ఏమంటోంది”

Comments are closed.