మళ్లీ వాయిదా.. మళ్లీ ఎప్పుడో?

సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో వాయిదాలు వేయడం కామన్ గా మారినట్టుంది. చెప్పిన డేట్ కు ఏ సినిమా రావట్లేదు. మొన్నటికిమొన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎన్నిసార్లు వాయిదా పడిందో చూశాం. ఇప్పుడు…

సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో వాయిదాలు వేయడం కామన్ గా మారినట్టుంది. చెప్పిన డేట్ కు ఏ సినిమా రావట్లేదు. మొన్నటికిమొన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎన్నిసార్లు వాయిదా పడిందో చూశాం. ఇప్పుడు లక్కీ భాస్కర్ వంతు.

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే 2 రిలీజ్ డేట్స్ ప్రకటించారు. అలా ప్రకటించిన ప్రతిసారి వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది.

ముందుగా అక్టోబర్ లో రిలీజ్ అనుకున్నారు. ఎప్పుడైతే ఓజీ వాయిదా పడిందో వెంటనే సెప్టెంబర్ 27 డేట్ తో పోస్టర్ వదిలారు. దేవర సినిమా ఆ తేదీకి వస్తోందని నిర్థారణ అయిన తర్వాత.. సెప్టెంబర్ 7 రిలీజ్ అంటూ మరో పోస్టర్ వదిలారు.

ఇప్పుడు ఆ తేదీకి కూడా లక్కీ భాస్కర్ వచ్చే అవకాశం లేదు. తమిళనాట సెప్టెంబర్ మొదటి వారంలో విజయ్ సినిమా రిలీజ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దుల్కర్ సినిమాను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు ముచ్చటగా మూడో రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో ఇది కామన్ ప్రాక్టీస్. ఆదికేశవ, టిల్లూ స్క్వేర్, గ్యాంగ్స్ ఆప్ గోదావరి.. ఇలా ఈమధ్య కాలంలో ‘సితార’ నుంచి వచ్చిన ప్రతి సినిమా వాయిదా పడుతోంది.

5 Replies to “మళ్లీ వాయిదా.. మళ్లీ ఎప్పుడో?”

Comments are closed.