ఆగస్ట్ 15 సినిమాలు.. మెరిసిన హీరోయిన్లు

ఆగస్ట్ 15.. మొత్తం 4 సినిమాలు రిలీజయ్యాయి. లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకునేందుకు అంతా పోటీపడ్డారు. కానీ ఎవ్వరూ క్యాష్ చేసుకోలేకపోయారు. పెద్ద సినిమాలు బొక్కబోర్లా పడగా.. ఓ చిన్న సినిమా మెప్పించినా…

ఆగస్ట్ 15.. మొత్తం 4 సినిమాలు రిలీజయ్యాయి. లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకునేందుకు అంతా పోటీపడ్డారు. కానీ ఎవ్వరూ క్యాష్ చేసుకోలేకపోయారు. పెద్ద సినిమాలు బొక్కబోర్లా పడగా.. ఓ చిన్న సినిమా మెప్పించినా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించలేకపోతోంది. ఈ సంగతి పక్కనపెడితే, అసలు పంద్రాగస్ట్ బాక్సాఫీస్ బరిలో నిలిచిన హీరోయిన్లలో ఎవరు క్లిక్ అయ్యారు?

భాగ్యశ్రీ బోర్సె.. ఈ సీజన్ లో మెరిసిన ఒకే ఒక్క హీరోయిన్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. ఆమె నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా రవితేజకు కలిసిరాకపోయినా, హరీశ్ శంకర్ చలవతో భాగ్యశ్రీకి బ్రహ్మాండంగా కలిసొచ్చింది. పైగా స్క్రీన్ టైమ్ కూడా ఎక్కువగా ఉండడం ఆమెకు ప్లస్ అయింది.

కావ్య థాపర్.. బ్యాడ్ లక్ ను బ్యాక్ ప్యాకెట్ లో పెట్టుకొని తిరుగుతోంది. ప్రామిసింగ్ ప్రాజెక్టులు చేస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు. ఆమె నటించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. తెరపై కావ్యను అన్ని రకాలుగా ఉపయోగించుకున్నారు. కేవలం హీరోయిన్ గానే కాకుండా, ఐటెం భామ తరహాలో కూడా ఆమె సేవలు వాడుకున్నారు. దీనికితోడు ఆమెతో యాక్షన్ కూడా. అయితే పడిన కష్టానికి ఆమెకు ప్రతిఫలం దక్కలేదు.

మాళవిక మోహనన్.. విక్రమ్ తో తంగలాన్ సినిమా చేసింది. తెలుగులో పాపులర్ అవ్వాలనే ఆమె లక్ష్యం, తంగలాన్ తో నెరవేరలేదు. ఈ సినిమా కేవలం ఓ సెక్షన్ ఆడియన్స్ కు మాత్రమే నచ్చింది.

నయన్ సారిక.. ఈ సీజన్ లో భాగ్యశ్రీ తర్వాత ఎక్కువమంది కుర్రకారును ఆకట్టుకున్న ముద్దుగుమ్మ. పేరుకు తగ్గట్టే నయనాలతో కట్టిపడేసింది. నటనాపరంగా కూడా మంచి ఈజ్ చూపించింది.

ఓవరాల్ గా ఆగస్ట్ 15 సినిమాల్లో కావ్య థాపర్, మాళవిక మోహనన్ ఫెయిల్ అవ్వగా.. భాగ్యశ్రీ, నయన్ సారిక మాత్రం ఆకట్టుకున్నారు. అవకాశాల విషయంలో భాగ్యశ్రీ ఇప్పటికే దూసుకుపోతోంది. నయన్ సారికకు కూడా మెల్లగా అవకాశాలొస్తున్నాయి.

5 Replies to “ఆగస్ట్ 15 సినిమాలు.. మెరిసిన హీరోయిన్లు”

Comments are closed.