కనీవినీ ఎరుగని డిజాస్టర్

నైజాంలో రెండు కోట్లు కూడా వసూలు చేయలేకపోవడం అంటే ఎంత దారుణమైన పరాజ‌యం అనుకొవాలి?

అగస్ట్ 15 కు పోటా పోటీగా విడుదలైన రెండు సినిమాలు ఫ్లాపులే.. అందులో సందేహం లేదు. వాటిలో ఒక సినిమా మాత్రం ఇటీవల కనీ వినీ ఎరుగనంత డిజాస్టర్ గా మిగిలిందన్నది ట్రేడ్ వర్గాల బోగట్టా.

నైజాంలో రెండు కోట్లు కూడా వసూలు చేయలేకపోవడం అంటే ఎంత దారుణమైన పరాజ‌యం అనుకొవాలి? నిజానికి దానికి ఏడింతల మొత్తం వసూలు చేస్తే తప్ప బయ్యర్ కు ఖర్చులు కూడా కిట్టుబాటు కావు. అలాంటిది కేవలం రెండు కోట్లు వసూలు చేయడం చాలా ఆశ్చర్యంగా వుంది. ఈ పరిస్థితి కేవలం నైజాంలోనే లేదు. ఆంధ్ర, సీడెడ్ ల్లో కూడా అదే పరిస్థితి. అయితే అక్కడ బయ్యర్లు ఎక్కువ మంది కనుక, నష్టం ముక్కలు ముక్కలుగా వుంది. కానీ నైజాంలో సింగిల్ బయ్యర్.

ఈ పరిస్థితి చూసి నిర్మాతే బాధపడుతున్నారని తెలుస్తోంది. తన వంతు సాయం ప్రతి ఒక్క బయ్యర్ కు చేస్తా అని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే దర్శకుడు కూడా ఎంతో కొంత పారితోషికం వెనక్కు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎంత ఇచ్చినా, నైజాంలో కనీసం ఇరవై శాతం మించి బయ్యర్ భరించలేరు. అంటే కనీసం నిర్మాత, దర్శకుడు కలిసి ఓ ఎనిమిది కోట్లు అయినా వెనక్కు ఇవ్వాల్సి వుంటుంది.

సదరు హీరోలు బోలెడు వరుస ఫ్లాపులు వున్నా, ఇంత దారుణమైన డిజాస్టర్ అయితే లేదు. గమ్మత్తేమిటంటే ఇంత దారుణమైన ఫ్లాప్ అయినా కూడా సదరు దర్శకుడు ఇంకా, డివైడ్ టాక్, యావరేజ్‌ మూవీ అనే భ్రమలో వుండిపోవడం. హీరో మాత్రం కనీసం సినిమాను కొద్దిగా అన్నా లేపే ప్రయత్నం చేయలేదు. నిర్మాత కూడా పరిస్థితి తెలిసి మౌనంగా వున్నారు.

50 Replies to “కనీవినీ ఎరుగని డిజాస్టర్”

  1. దెబ్బకి డైరక్టర్ తలపొగరు దిగుతుందిలే. ప్రతీ ఈవెంట్ లో అనవసరంగా మీడియా మీద నోరు పారేసుకున్నాడు. మీడియా టైమ్ కోసం చూసి వాడిని అసలు వదలట్లేదు. వేరే సినిమా ఫ్లాప్ అయినా కూడా వీడినే వేసుకుంటున్నారు.

    1. మీడియానే కాదు, ఎవరో నెటిజన్ రవితేజని ట్రైలర్ చూసి నువ్వు స్క్రిప్ట్ సెలక్షన్ కంటే హీరోయిన్ సెలక్షన్ బాగా చూసుకుంటున్నావ్ అన్నాడు, దానికి ఆ డైరెక్టర్ ఓవరాక్షన్ చేసి వాడిని చేడా మడ తిట్టాడు. ఇప్పుడు ఏమంటాడో?

  2. అసలు హీరో, డైరెకర్ లకి ( 50-60 శాతం వీళ్ళకే వెళుతుంది కాబట్టి) రెమ్యునరేషన్ అనేది రద్దు చేసి,

    సినిమా విడుదల అయిన తర్వాత ప్రతి టిక్కెట్టు లో ముందుగా ఒప్పుకున్న శాతం వాళ్ళ అకౌంట్ లో పడేటట్లు చేస్తే, ఈ గొడవలు అనేవి రావు l.

    సినిమా అనేది ఆడితే హీరో, డైరేకర్ లకి డబ్బు వస్తాయి. లేకపోతే రావు.

    1. అడుక్కు తిని గౌరవంగా బతుకు .ఇలా ఒళ్ళు అమ్ముక్కోవద్దు. ఎందుకు రా భూమి మీద పద్దవ్. ఇలా వ్యభిచారం కోసమా

  3. Same ade rodda kottudu action, ave elevations, ave dikku malina songs…Aa movies ni chudalante rates penchutaru malli… Time and money waste… OTT kooda dandaga… TV lo veste kooda chudatam dandaga

  4. ఈనీ ఫ్లాప్ లు వచ్చినా ఇంకా వేధవలతో కోట్లు కు కోట్లు ఇచ్చిన నిర్మాత లు ఉండటం ఆశ్చర్యం .ఇంత కన్నా ఒక 100 ఎకరాలు మామిడి తోట వేసుకుంటే మంచిది కదా .వ్యవసాయం కూరగాయలు చేపల వ్యాపారం ఇలా ఎన్నో ఉన్నాయి . హిట్ అయిత్3 రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు . ఫ్లాప్ అయితే రూపాయి కూడా తగ్గించే పని లె. రవితేజ కి హిట్ వచ్చి 3 ఏళ్లు అయింది .ఏమిటో ఈ నిర్మాతలు ఆశ

    1. ఇంకేం లేదు, బ్లాక్ మనీని వదులుకోవడానికి అని చాలా మంది అభిప్రాయం, కాదు గట్టి నమ్మకం

    2. ఆలా కోట్ల తో తోటలు భూములు కొంటె వచ్చిన నల్ల ధనాన్ని తెల్ల ధనం గ మార్చడం అసలు మతలబు

  5. Bro great andhra , release ki mundhu me head ni titadana ga negativity spread chesav movie Pina. And this shows how talented your and your team on colapsing a movie which is far better than the other release on the same day. If you have date write this article with a name

  6. సామాన్య ప్రేక్షకులకే తెలుసు రవితేజ మంచి ఫామ్ లో (క్రికెట్లో లాగ సినిమా ఇండస్ట్రీలో ఇది ఉంటుందా?) లేడు, అతని సినిమాలు నడవవు అని, కోట్లు సంపాదించిన నిర్మాతలకు అంతమాత్రం తెలియదా?

    ఇంకా తీస్తున్నారంటే మతలబు ఏంటి?

  7. విలువలు వంకాయలు అని చెప్పే మీరు…ఇలాంటి ప్లాప్ సినిమా కూడా బ్లాక్బస్టర్ హిట్ అని మన వెబ్సైటు లో advertise చెయ్యడం ఏంటి మరి…..ఇలా వాళ్ళ డబ్బులు తీసుకుని మల్ల వాళ్ళ మీదనే ఆర్టికల్స్ రాసి ఏడచడం ఎంత వరకు కరెక్ట్ మరి

    1. రవి తేజ గారికి GA గారికీ గత జన్మలోనో… ఈ జన్మలోనో.. పొలం గట్టు గొడవలు ఏవో ఉన్నట్టు ఉన్నాయి. ఒక్క పాజిటివ్ న్యూస్ కూడా చూడలేదు ఈ వెబ్సైట్ లో. ఇక HS గారు, TG గారు… Pk గారి మనుషులు అనో ఏమో .. ga గారు max try చేస్తున్నారు మూవీ ని తొక్కేయడానికి… అలా అని నేను ఈ మూవీ ఏదో కళాఖండం అనట్లేదు గానీ.. ga గారి ఏడుపు చూస్తే నవ్వు వస్తుంది.

Comments are closed.