ఘట్టమనేని వారసుడు రెడీ

ఒకప్పటి హీరో కృష్ణ మనవడు జ‌యకృష్ణ సినిమాల్లోకి రావడానికి రెడీ అయిపోతున్నాడు. కృష్ణ పెద్ద కొడుడు రమేష్ బాబు కొన్ని సినిమాలు హీరోగా ప్రయత్నించారు. తరువాత ఇంటికే పరిమితం అయ్యారు. అనారోగ్యంతో అకస్మికంగా మరణించారు.…

ఒకప్పటి హీరో కృష్ణ మనవడు జ‌యకృష్ణ సినిమాల్లోకి రావడానికి రెడీ అయిపోతున్నాడు. కృష్ణ పెద్ద కొడుడు రమేష్ బాబు కొన్ని సినిమాలు హీరోగా ప్రయత్నించారు. తరువాత ఇంటికే పరిమితం అయ్యారు. అనారోగ్యంతో అకస్మికంగా మరణించారు.

రమేష్ బాబు కొడుకు జ‌యకృష్ణ ఇప్పుడు రెడీ అయ్యారు. చదువు పూర్తి చేసుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యారు. ముందుగా స్క్రిప్ట్ లు వినడం ప్రారంభించారు. ఈ లోగా ఓ ఫొటో షూట్ పూర్తి చేసి, బయటకు ఫొటోలు వదిలారు. తండ్రి, తాత పోలికలతో బాగానే వున్నాడు. స్క్రీన్ ప్రెజెన్స్ వరకు ఓకె. నటన ఎలా వుంటుందో చూడాలి.

వారసత్వం అనేది అరంగ్రేటం వరకు పనికి వస్తుంది. నిలబెట్టేది మాత్రం నటనే. మహేష్ కన్నా ముందు రమేష్ ట్రయ్ చేసారు కానీ సక్సెస్ కాలెేదు. మహేష్ కు స్టార్ డమ్ వచ్చింది. ఇప్పుడు రమేష్ కొడుకు తన లక్ పరీక్షించుకోవాలి అనుకుంటున్నారు. ఎలా వుంటుందో, మహేష్ కొడుకు గౌతమ్ ఇప్పటికే తెరమీదకు వచ్చారు. జ‌స్ట్ ఒకసారి. తన చదువు కమ్ నటన శిక్షణ పూర్తి చేసుకోవడానికి ఇంకా టైమ్ వుంది.

అప్పటి లోగా జ‌యకృష్ణ ఎంట్రీ ఇచ్చి, నిలబడతాడేమో చూడాలి. అన్న అంటే మహేష్ కు చాలా ఇష్టం. అన్న కుటుంబం మంచి చెడ్డలు మహేష్ నే చూసుకుంటారు అనే టాక్ వుంది. మరి ఇప్పుడు ఈ కుర్రాడి బాధ్యత కూడా మహేష్ తీసుకుంటారేమో? చూడాలి.

21 Replies to “ఘట్టమనేని వారసుడు రెడీ”

    1. షారుఖ్ ఖాన్ గొప్పగా ఉంటాడా? అల్లు అర్జున్ మొదట్లో ఎలా ఉండేవాడు?

  1. Mana Kharma Ra Babu… Veellu Veella Pillalu, Annayya Thammudu Bammardi Mavayya Pillalu… Tarvata Manavallani Kuda Mana Meeda Ruddutunnaru… Tollywood Maaradu…

  2. “అన్న కుటుంబం మంచి చెడ్డలు మహేష్ నే చూసుకుంటారు అనే టాక్ వుంది.”

    నిజంగా? తన వొంటిని చూసుకోవడానికి 10 మంది bueticians ని పెట్టుకొని తిరుగుతాడు. అయితే ఆదిశేషగిరి రావు లేకుంటే విజయ కృష్ణ నరేష్ పట్టించుకోవాల్సిందే!

Comments are closed.