పవన్ 3 సినిమాల నుంచి అప్ డేట్స్ ఉంటాయా?

పవన్ కల్యాణ్ పుట్టినరోజు వస్తోంది. ఆయన చేతిలో 3 సినిమాలున్నాయి. కాబట్టి ఈ బర్త్ డేకి 3 సినిమాల నుంచి 3 అప్ డేట్స్ ఉంటాయని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ ఒక సినిమా…

పవన్ కల్యాణ్ పుట్టినరోజు వస్తోంది. ఆయన చేతిలో 3 సినిమాలున్నాయి. కాబట్టి ఈ బర్త్ డేకి 3 సినిమాల నుంచి 3 అప్ డేట్స్ ఉంటాయని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ ఒక సినిమా నుంచి అప్ డేట్ డౌట్?

ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నారు పవన్. వీటిలో ఓజీ నుంచి పెద్ద సర్ ప్రైజ్ రాబోతోంది. హరిహర వీరమల్లు నుంచి కచ్చితంగా ఓ పోస్టర్ వస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మాత్రం ఏదైనా వస్తుందా అనేది అనుమానం.

“పవన్ కల్యాణ్ మా సినిమాకు పని చేసింది చాలా తక్కువ. అందులోంచే మేం ఒక గ్లింప్స్, 2 టీజర్లు, చాలా ఫొటోలు వదిలేశాం. మరో టీజర్ వదలాలంటే కొత్తగా మళ్లీ షూట్ చేయాలి. ఓజీ నుంచి పెద్దగా సర్ ప్రైజ్ వస్తోంది కాబట్టి, ఈసారి మేం అప్ డేట్ చేయడం లేదు. మేం కూడా ఓజీ అప్ డేట్ ని సెలబ్రేట్ చేస్తాం”

హరీశ్ శంకర్ తాజా స్టేట్ మెంట్ ఇది. సో.. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఈసారి వీడియో రాదనేది పక్కా. కచ్చితంగా ఏదో ఒకటి రిలీజ్ చేస్తామని నిర్మాత రవిశంకర్ ప్రకటించారు కాబట్టి.. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ మాత్రం రిలీజయ్యే ఛాన్స్ ఉంది.

One Reply to “పవన్ 3 సినిమాల నుంచి అప్ డేట్స్ ఉంటాయా?”

Comments are closed.