టీడీపీలో పార్టీ ఫిరాయించిన పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీంబాషా, అలాగే మరో 8 మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీలో చేర్చుకుని, ఆ తర్వాత పట్టించుకోకపోవడంపై మనస్తాపం చెంది, తిరిగి వైసీపీలో రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి సమక్షంలో చేరడానికి సిద్ధమయ్యారు.
నెల క్రితం టీడీపీలో చేరిన పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీంబాషాతో మరో 8 మంది కౌన్సిలర్లు, అలాగే వక్ఫ్‌బోర్డు జిల్లా అధ్యక్షుడు అమ్మూను తిరిగి తమ వైపు తిప్పుకున్నారు. వాళ్లందరినీ ఇవాళ తిరుపతి వేదికగా వైసీపీలోకి మిధున్‌రెడ్డి ఆహ్వానించనున్నారు.
ఈ దఫా ఎన్నికల్లో వైసీపీ గెలిచిందే 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాల్లో. వీటిలో రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాల్లో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు గెలుపొందిన సంగతి తెలిసిందే. వైసీపీలో పెద్దిరెడ్డి కుటుంబం కీలకంగా మారడంతో, ఎలాగైనా దెబ్బతీయాలని చంద్రబాబు సర్కార్ పట్టుదలతో వుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరులో ఆయన్ను దెబ్బ కొట్టేందుకు మున్సిపాల్టీని హస్తగతం చేసుకోడానికి టీడీపీ ఎత్తుగడ వేసింది.
ఇందులో భాగంగా పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీంబాషాతో పాటు మరో 8 మంది కౌన్సిలర్లను టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు పార్టీలో చేర్చుకున్నారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లతో ప్రెస్‌మీట్ పెట్టించి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిట్టించారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు చల్లా బాబు, టీడీపీ ముఖ్య నాయకులకు కాల్ చేసినా, కనీసం రిసీవ్ చేసుకునే పరిస్థితి లేకపోయింది.
దీంతో తాము మోసపోయామని చైర్మన్, కౌన్సిలర్లకు అర్థమైంది. వైసీపీని వీడి తప్పు చేశామని గ్రహించి, ఆ తర్వాత మిధున్‌రెడ్డికి రాయబారం పంపినట్టు తెలిసింది. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లతో మిధున్‌రెడ్డి చర్చించి, వైసీపీలో చేర్చుకోడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాళ్లందరూ రాజంపేట ఎంపీ సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకోడానికి ఇవాళ ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. కేవలం టీడీపీ కండువాలు వేయడం, ఆ తర్వాత పట్టించుకోకపోవడం… ఇదే తంతు అని పార్టీ మారిన నేతలు వాపోతున్నారు. కనీసం నెల కూడా టీడీపీలో కొనసాగలేకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
bolli babu ke vennupotaa, inka three years vundi tarvaata raavaalsindi
మా అన్నయ్య రాజకీయం ముందు వీళ్ళంత అన్లేదు సంతోషం..
Call boy works 8341510897
వై నాట్ వైసిపి పార్టీ ఖాళీ అవుతున్నది.?
వైసిపి పార్టీ ..
ఎంపీలు …
ఎమ్మెల్సీలు..
ఎమ్మెల్యేలు..
జిల్లా పరిషత్ చైర్మన్లు…
కార్పొరేషన్ మేయర్లు..
మున్సిపల్ చైర్మన్ లు..
సర్పంచులు..
Z.P.T.C.లు..
M.P.T.C.లు..
వాట్ ఇస్ దిస్…
జగన్ రెడ్డి…
Jai douda jagan