లైంగిక వేధింపులపై కమిటీ

కేరళలో సంచలనం సృష్టిస్తున్న హేమ కమిటీ రిపోర్ట్ ప్రభావం కోలీవుడ్ పై కూడా పడింది. ఎట్టకేలకు నడిగర్ సంఘంలో ఈ దిశగా కదలిక వచ్చింది. నాజర్ అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశమైన ఈ సంఘం.. పరిశ్రమలో…

కేరళలో సంచలనం సృష్టిస్తున్న హేమ కమిటీ రిపోర్ట్ ప్రభావం కోలీవుడ్ పై కూడా పడింది. ఎట్టకేలకు నడిగర్ సంఘంలో ఈ దిశగా కదలిక వచ్చింది. నాజర్ అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశమైన ఈ సంఘం.. పరిశ్రమలో లైంగిక వేధింపులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

తమిళ చిత్ర సీమలో లైంగిక వేధింపుల విచారణకు సంబంధించి నడిగర్ సంఘం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటుచేయబోతోంది. ఇందులో 10 మంది సభ్యులుంటారు. ఇకపై లైంగికంగా ఎవరైనా వేధింపులకు గురైతే, ఈ కమిటీకి ఫిర్యాదు చేయొచ్చు.

కమిటీనే సదరు బాధితురాలి తరఫున పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. అవసరమైతే బాధితురాలి కోసం లాయర్ ను కూడా ఏర్పాటుచేస్తుంది. ఎవరైనా దోషులుగా తేలితే, వాళ్లను పరిశ్రమ నుంచి ఐదేళ్ల పాటు బహిష్కరిస్తారు.

ఈ సమావేశంలో నడిగర్ సంఘం సభ్యులు కోవై సరళ, ఖుష్బూ, సుహాసిని, ట్రెజరర్ కార్తి, జనరల్ సెక్రటరీ విశాల్ పాల్గొన్నారు. అంతా కలిసి చర్చించుకొని కమిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కీలకమైన 7 పాయింట్లతో మీడియాకు సమాచారం అందించారు. వీటిలో ఓ కీలకమైన పాయింట్ కూడా ఉంది. అదేంటంటే, ఎవరైతే తమపై లైంగిక దాడి జరిగిందని ఆరోపిస్తారో, వాళ్లు కమిటీకి మాత్రమే ఫిర్యాదు చేయాలి. మీడియాలో మాట్లాడకూడదు.

లైంగిక వేధింపులపై ఏర్పాటయ్యే కమిటీ కార్యకలాపాల్ని నడిగర్ సంఘం నేరుగా పర్యవేక్షిస్తుందని.. అవసరమైతే బాధితురాలిగా పరిహారం అందించడం లేదా ఆదుకోవడం లాంటి పనులు కూడా చేస్తుందని వెల్లడించారు.

బెంగాలీ చిత్ర పరిశ్రమలో, కన్నడ చిత్ర పరిశ్రమలో ఇలాంటి కమిటీలు ఏర్పాటుచేయాలని ఇప్పటికే ఆందోళనలు మొదలయ్యాయి. టాలీవుడ్ లో కూడా లైంగిక వేధింపులకు సంబంధించి ఓ నివేదిక విడుదల చేయాలని, కమిటీని ఏర్పాటుచేయాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్స్ కు సమంత లాంటి హీరోయిన్లు మద్దతిస్తున్నారు.

11 Replies to “లైంగిక వేధింపులపై కమిటీ”

  1. “నడిగర్ సంఘం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటుచేయబోతోంది. ఇందులో 10 మంది సభ్యులుంటారు”

    vairamuthu and chinmayi

  2. Success అయిన ఎ ఒక్క హిరొఇన్ కూడా ఇప్పటివరకు report చెయ్యలెదు

    ఎ Industry అయినా సరె ,.Telugu,Tamil,Kannada,Malayalam,Hindi ..5 లెదా 6 సినిమాల్లొ నటించిన హిరొఇన్ అయినా సరె,….. ఒ అరొపణ అయినా చెసిందా ?

  3. అవకాశాల కోసం అంగలేస్తూ పంగలు చాచే పడుచులు ఉన్నంత కాలం ఇది ఆగదు. మీరు చేసే పని మీరు చెయ్యండి.కనీసం ట్రాప్పింగ్ అన్న అగుద్ది.

  4. Success అయినా హీరోయిన్ అలవాటు paddara లేక శ్రమకు తగ్గ ఫలితం పొంది మిన్నకుండు పోయారు? Its very prevalent in kolly & tolly.

  5. బా. ..బు మళ్లీ నీకు ఏమీ కు. ట్టిం..ది, ఎలివేషన్స్ స్టార్ట్ చేసావు. అ ..న్న is not she M material remember this point. కావాలంటే ఏదైనా ఓ దా ర్పు కొ లువు create చేస్తే దయతలచి ఒక కొ లువు ఇవ్వచ్చు అది బెస్ట్ suited job for him.

Comments are closed.