ఈసారి సంక్రాంతి కాస్త అయోమయోమే

రకరకాల వార్తలు, మెగాస్టార్ యువి సంస్థ నిర్మించే విశ్వంభర సినిమా సంక్రాంతికి విడుదల చేస్తామంటే తమ దగ్గర స్లాట్ లేదని ఓటీటీ వాళ్లు చెబుతున్నారని ఓ టాక్. రామ్ చరణ్- దిల్ రాజు నిర్మించే…

రకరకాల వార్తలు, మెగాస్టార్ యువి సంస్థ నిర్మించే విశ్వంభర సినిమా సంక్రాంతికి విడుదల చేస్తామంటే తమ దగ్గర స్లాట్ లేదని ఓటీటీ వాళ్లు చెబుతున్నారని ఓ టాక్. రామ్ చరణ్- దిల్ రాజు నిర్మించే గేమ్ ఛేంజ‌ర్ సినిమాను డిసెంబర్ కు ఇవ్వలేను, సంక్రాంతి వేళకు ఇస్తానని దర్శకుడు శంకర్ చెబుతున్నారని ఇంకో టాక్. అంటే విశ్వంభర వెనక్కు వెళ్లాల్సిన పరిస్థితి, గేమ్ ఛేంజ‌ర్ సంక్రాంతికి రావాల్సిన పరిస్థితి. కానీ విశ్వంభరను సంక్రాంతికి దింపితేనే థియేటర్ మార్కెట్ బాగుంటుంది. అదే నిర్మాతల పంతం. అందుకోసం ఓటీటీ సంస్థలతో కుస్తీ పడుతున్నారు.

మరోపక్కన గేమ్ ఛేంజ‌ర్ క్రిస్మస్ కు వస్తే, వెంకీ- అనిల్ రావిపూడి సినిమాను సంక్రాంతికి తేవచ్చు. అ విధంగా రెండు సీజ‌న్ లను క్యాష్ చేసుకోవచ్చు అన్నది నిర్మాత దిల్ రాజు అలోచన. కానీ గేమ్ ఛేంజ‌ర్ విషయంలో అది సాధ్యం అయ్యేలా లేదు. విశ్వంభర వస్తే గేమ్ ఛేంజ‌ర్ ను సంక్రాంతికి తేలేరు. కానీ రాకపోతే మాత్రం తెచ్చుకోవచ్చు. కానీ అప్పుడు వెంకీ- అనిల్ రావిపూడి సినిమా టైటిల్ కే అన్యాయం జ‌రుగుతుంది. సంక్రాంతికి వస్తున్నాం అన్నది కదా టైటిల్.

ఇదిలా వుంటే ఎందుకన్నా మంచిది అని దిల్ రాజు తను నితిన్ తో నిర్మించే తమ్ముడు సినిమాను రెడీ చేసి వుంచుతున్నారు. నిర్మాత నాగవంశీ తన మ్యాడ్ 2 సినిమాను రెడీ చేస్తున్నారు. ఇవన్నీ ఇలా వుంటే బాలయ్య- బాబీ సినిమా వుండనే వుంది. అది సంక్రాంతికి తేవాలని అనుకుంటున్నారు. కానీ వీలవుతుందా చూడాలి.

సంక్రాంతి వ్యవహారం ఇలా వుందని, సందీప్ కిషన్- నక్కిన త్రినాధ్- రాజేష్ దండా నిర్మించే ‘మజాకా’ సినిమాకు కూడా సంక్రాంతి డేట్ వేసారు. ఇలా మొత్తం మీద అంతా పైకి పొక్కకపోయినా, తెరవెనుక చాలా జ‌రుగుతోంది.

6 Replies to “ఈసారి సంక్రాంతి కాస్త అయోమయోమే”

  1. వీటిని థియేటర్లో చూడం, మేం ఇంట్లో సంక్రాంతి పండగ చేసుకుంటాం ఎలాంటి అయోమయం లేకుండా

Comments are closed.