విశ్వంభర ను వెనక్కి.. చరణ్ కోసం?

రామ్ చరణ్ నే స్వయంగా తన గేమ్ ఛేంజ‌ర్ సినిమా కోసం విశ్వంభర సినిమాను వెనక్కు జ‌రిపినట్లు బోగట్టా.

విశ్వంభర సినిమా సంక్రాంతి బరి నుంచి వెనక్కు జ‌రిగింది. దానికి కారణం ఓటీటీ స్లాట్ లేకపోవడం అన్నది టాలీవుడ్ లో వినిపిస్తున్న విషయం. కానీ అది కాదని, రామ్ చరణ్ నే స్వయంగా తన గేమ్ ఛేంజ‌ర్ సినిమా కోసం విశ్వంభర సినిమాను వెనక్కు జ‌రిపినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.

గేమ్ ఛేంజ‌ర్ సినిమా ఎప్పటి నుంచో నడుస్తోంది. డేట్ ప్రకటించలేకపోతోంది. క్రిస్మస్ కు రావడం పెద్ద ఇబ్బంది కాదు. కానీ సంక్రాంతి అన్నది అటు తమిళ్, ఇటు తెలుగులో పెద్ద సీజ‌న్. అందుకే దర్శకుడు శంకర్ సంక్రాంతికే ఇవ్వగలను అనే మాట చెబుతూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్ తనకు అత్యంత సన్నిహితుడు, నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ రెడ్డిని విశ్వంభర వాయిదా కు ఒప్పించినట్లు తెలుస్తోంది.

విశ్వంభర కాపీ మొత్తాన్ని రెడీ చేసి వుంచుకుని, గేమ్ ఛేంజ‌ర్ పక్కాగా జ‌నవరికి వస్తే, విశ్వంభర ను వెనక్కు జ‌రుపుతారు. లేదంటే సంక్రాంతికి వదిలేస్తారు. కానీ గేమ్ ఛేంజ‌ర్ రావడం పక్కా. అందుకే విశ్వంభర వెనక్కు వెళ్లక తప్పదు.

కానీ వినిపిస్తున్న వార్తల ప్రకారం గేమ్ ఛేంజ‌ర్ సినిమా పక్కాగా సంక్రాంతికి ఫిక్స్ అయినట్లే. అందువల్ల రామ్ చరణ్ స్నేహం కోసం విశ్వంభర వెనక్కు వెళ్లక తప్పదు అని తెలుస్తోంది.

12 Replies to “విశ్వంభర ను వెనక్కి.. చరణ్ కోసం?”

    1. నష్టమే లేదు నువ్వు కడప రాజ్యం లో cinema ki అయితే గు. ద్ద. లిప్పి వెళ్తావ్ అని తెల్సు మల్ల R G V gaadi cinema kosam chchhae dhaaka wait che ayutge

    2. థియేట్రికల్ experience బాగుంది అని టాక్ వస్తేనే థియేటర్ లో చూస్తాం

  1. స్లాటింగ్ అనేది హాలీవుడ్ లో కూడా వున్న విధానం.

    అంటే మన సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తే ఎక్కవ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది అనేది.

    కానీ అక్కడ మన సినిమా కోసం వేరే సినిమా లని ఆపరు.

    మన దగ్గర మన సినిమా కోసం వేరే సిన్మా లని ఆపుతున్నారు అని అంటున్నారు.

    అంటే మన సినిమా లో సత్తా లేదు అనా లేక

    వేరే వాడు సిన్మా వుంటే మన సిన్మా ఆడదు అనా లేక

    వేరే సిన్మా తప్పుకుంటేనే కానీ మన సిన్మా ఆడలేదు అనా

    దీని అర్థం!

Comments are closed.