టీడీపీ ఎంపీ పై మండిపడుతున్న ఉక్కు ఉద్యోగులు

విశాఖ ఉక్కు ఉద్యోగులు కార్మికులు జీవన పోరాటం చేస్తున్నారు. ప్రైవేట్ పరం కాకుండా స్టీల్ ప్లాంట్ ని రక్షిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు నాలుగు నెలలు…

విశాఖ ఉక్కు ఉద్యోగులు కార్మికులు జీవన పోరాటం చేస్తున్నారు. ప్రైవేట్ పరం కాకుండా స్టీల్ ప్లాంట్ ని రక్షిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు నాలుగు నెలలు అయినా ఆ సమస్యను పట్టించుకోవడం లేదని ఉక్కు ఉద్యమ సంఘాలు అంటున్నాయి.

ఢిల్లీ వెళ్ళడం అక్కడ మంత్రులను కలసి వినతి పత్రాలు ఇవ్వడం తప్ప టీడీపీ కూటమి నేతలు ఏమీ చేయడం లేదని కూడా విమర్శిస్తున్నారు. విశాఖ ఎంపీ భరత్ అయితే స్టీల్ ప్లాంట్ మీద కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారని అంటున్నారు.

కూటమితో కాకుడా సింగిల్ గా పోటీ చేసి ఉంటే విశాఖ ఉక్కుని కాపాడే వారమని లేటెస్ట్ గా భరత్ చేసిన ఈ కామెంట్స్ పట్ల ఉక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కూటమితో జత కట్టబట్టే లక్షల మెజారిటీతో గెలిచారని గుర్తు చేస్తున్నారు. సింగిల్ గా పోటీ చేసి గత ఎన్నికల్లో ఓటమి పాలు అయిన సంగతిని గుర్తు చేస్తున్నారు.

స్టీల్ ప్లాంట్ ని కాపాడుతామని ఇచ్చిన హామీ మేరకే భరత్ కి అత్యధిక మెజారిటీతో కార్మిక లోకం గెలిపించిందని అంటున్నారు. అయినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం టీడీపీ మద్దతుతో ఉందని వారి మీద ఒత్తిడి చేసి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ గండం నుంచి తప్పించకుండా ఈ కొత్త మాటలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు

వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ కూడా టీడీపీ కూటమి నేతలను నిలదీస్తున్నారు. ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చేసిన తరువాత స్టీల్ ప్లాంట్ ఇష్యూని పక్కన పెట్టేశారు అని అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ని రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సింగిల్ గా గెలిచి ఉంటే స్టీల్ ప్లాంట్ మీద పోరాడేవాళ్ళమని భరత్ అనడంలో అర్ధం ఏంటని అంటున్నారు. బీజేపీతో మిత్రుడిగా ఉండి సాధించలేనిది పోరాటాలతో సాధిస్తారా అని కూడా ఉక్కు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

8 Replies to “టీడీపీ ఎంపీ పై మండిపడుతున్న ఉక్కు ఉద్యోగులు”

  1. నీచుడు జగన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేసి మిగిలిన 35 వేల ఎకరాలలో రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకుందామనుకున్నాడు కుదరలేదని నీ ఏడుపు

  2. Men may come and men may go, but vizag steel will be privatized,all other measures will be temporary. But Govt should return the so much land they acquired from farmers

  3. జరగాల్సిందె… ఇంకా ఏముంది… ఇలానే మెల్లి మెల్లిగా లాక్ ఔట్… భలే రంజుగ ఉంటాది

Comments are closed.