విచార‌ణ‌కు రావ‌య్యా స‌జ్జ‌ల‌!

మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడి కేసులో విచార‌ణ‌కు రావాల‌ని వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, జ‌గ‌న్ ప్ర‌భుత్వ మాజీ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి మంగ‌ళ‌గిరి రూర‌ల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 17న…

మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడి కేసులో విచార‌ణ‌కు రావాల‌ని వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, జ‌గ‌న్ ప్ర‌భుత్వ మాజీ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి మంగ‌ళ‌గిరి రూర‌ల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 17న విచార‌ణ నిమిత్తం రావాల‌ని నోటీసులో పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో 2021 అక్టోబ‌ర్ 19న టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. నాడు టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి వైసీపీ అధినేత‌, అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ప‌ట్టాభి అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్‌ను నిర‌సిస్తూ కొంద‌రు వైసీపీ కార్య‌క‌ర్త‌లు టీడీపీ కార్యాల‌యంపై దాడికి పాల్ప‌డ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేకెత్తించింది. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో నిందితుల ఆట క‌ట్టించేందుకు వేట మొద‌లు పెట్టింది. ఇందులో భాగంగా బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇదే కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆ పార్టీ విజ‌య‌వాడ నాయ‌కుడు దేవినేని అవినాష్ త‌దిత‌రుల‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప‌క‌డ్బందీ వ్యూహం ర‌చించారు. అయితే వీళ్లంతా సుప్రీంకోర్టులో ఉప‌శ‌మ‌నం పొందారు. అయితే విచార‌ణ ఎదుర్కొంటున్నారు.

తాజాగా విచార‌ణ కోసం రావాలంటూ స‌జ్జ‌ల‌కు నోటీసులు ఇవ్వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఏదో ఒక కేసులో వైసీపీ ముఖ్య నాయ‌కుల్ని అరెస్ట్ చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో టీడీపీ వుంది. అయితే కోర్టును ఆశ్ర‌యిస్తూ వైసీపీ నాయ‌కులు అరెస్ట్ నుంచి త‌ప్పించుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి కేసులు తెర‌పైకి వ‌స్తాయో మ‌రి!

12 Replies to “విచార‌ణ‌కు రావ‌య్యా స‌జ్జ‌ల‌!”

  1. వైసీపీ లో అందరికన్నా ఎక్కువ గోరోజనం ఇతనికే..

    ఎయిర్పోర్ట్ లో ఆపి వదిలేసినందుకు యాగీ చేస్తున్నాడు..

  2. జగ్గులి గాడి హ*త్యల రహ*స్యాలు అన్ని చెప్పేసి లొంగిపోతే కారు*ణ్య కోటా కింద చిన్న శి*క్ష తో వది*లేస్తారు.

    లేకపోతే వీడిని 6 అడుగుల గునపం మీద కసు*క్కున కూర్చో*బెట్టడం ఖాయం.

  3. అవినీతి మరియు అసభ్య రాజకీయాలు: బోరుగడ్డ అనిల్ అరెస్టుతో ప్రజల సమాధానం స్పష్టమైంది

    బోరుగడ్డ అనిల్ ఈరోజు అరెస్టు కావడం, ప్రజలు జగన్‌కు గట్టి సమాధానం ఇచ్చినట్లే కనిపిస్తోంది. అనిల్ వంటి వ్యక్తుల వల్లే పార్టీకి ప్రతిష్టహాని కలుగుతోంది. ఆయన అసభ్యమైన, తిడుతూ మాట్లాడే భాష ప్రజల నమ్మకాన్ని దూరం చేస్తుంది. జగన్‌ను నిజంగా మద్దతు ఇస్తున్నారా? అయితే, బోరుగడ్డ అనిల్ లాంటి వారిని అనుసరించకండి. ఆయన ఏ స్థితికి చేరుకున్నాడో, జగన్ నాయకత్వం కూడా ఇలాంటి నెగటివ్ వ్యక్తుల వల్ల ఇబ్బందుల్లో పడుతోంది.

    రాజకీయాల్లో అసభ్యమైన భాషకు అవసరం ఏమిటి? సంస్కారం, మర్యాదతో మాట్లాడటం ప్రజల గౌరవాన్ని పొందేందుకు చాలా ముఖ్యమైనది. అనిల్ పరిస్థితి ప్రతి ఒక్కరికీ పాఠం కావాలి—అసభ్యమైన ప్రవర్తన, జలగట్టు భాష మనిషిని కేవలం కష్టాల్లోకి తీసుకెళ్లడం తప్ప, గౌరవం తీసుకురాదు.

Comments are closed.