పక్కా కమర్షియల్ మెకానిక్

విశ్వక్ సేన్ సినిమాలు అంతోఇంతో కొత్తగా ఉంటాయి. అతడి శ్వాగ్ కూడా బాగా పాపులర్ అయింది. ఈసారి మాత్రం కొత్తదనాన్ని నమ్ముకోకుండా, తన స్టయిల్ తో పాటు మాస్ ఎలిమెంట్స్ ను ఈ హీరో…

విశ్వక్ సేన్ సినిమాలు అంతోఇంతో కొత్తగా ఉంటాయి. అతడి శ్వాగ్ కూడా బాగా పాపులర్ అయింది. ఈసారి మాత్రం కొత్తదనాన్ని నమ్ముకోకుండా, తన స్టయిల్ తో పాటు మాస్ ఎలిమెంట్స్ ను ఈ హీరో నమ్ముకున్నట్టున్నాడు. కొద్దిసేపటి కిందట విడుదలైన మెకానిక్ రాకీ ట్రయిలర్ చూస్తే ఇదే అనిపిస్తుంది.

‘మెకానిక్ రాకీ’ ట్రయిలర్ లో విశ్వక్ మార్క్ కంటే పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఓ కారు మెకానిక్, ఉరిలో ఓ పెద్ద మనిషితో జగడం, ఇద్దరు హీరోయిన్లు, ఇద్దరితో ప్రేమ, పంచ్ డైలాగ్స్.. ఇలాంటి అంశాలు మాత్రమే కనిపించాయి. కానీ సినిమాలో అంతకుమించి ఉంటుందంటున్నాడు విశ్వక్.

“సినిమా సెకండాఫ్ మొత్తం సీట్ ఎడ్జ్ థ్రిల్ ఉంటుంది. క్లయిమాక్స్ చూసిన తర్వాత రెండోసారి సినిమా చూడాలనే కోరిక కలుగుతుంది. సెకండాఫ్ లో థియేటర్లన్నీ ఆడిటోరియమ్స్ గా మారిపోతాయి. రాసిపెట్టుకోండి.”

ఇప్పుడు రిలీజైన ట్రయిలర్ కేవలం శాంపిల్ మాత్రమే ఉంటున్నాడు విశ్వక్. అందుకే 1.O అనే పేరు పెట్టామని, రిలీజ్ కు దగ్గర్లో మరో ట్రయిలర్ వస్తుందని, అందులో అసలైన మేటర్ ఉంటుందని అంటున్నాడు.

నవంబర్ 22న సినిమా రిలీజ్ అవుతుందని.. 21వ తేదీ సాయంత్రం 7.30 గంటల నుంచే పెయిడ్ ప్రివ్యూస్ మొదలవుతాయని.. పెయిడ్ ప్రివ్యూస్ లో ఎవరైనా సినిమా బాగాలేదంటే, 22న ఎవ్వరూ థియేటర్లకు రావొద్దని అంటున్నాడు.

4 Replies to “పక్కా కమర్షియల్ మెకానిక్”

Comments are closed.