డిజైన్లు కాదుసార్.. బడ్జెట్లో మార్పుల్లేవని చెప్పగలరా?

చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా గద్దె ఎక్కిన తరువాత అనేక విషయంలో ఒక దెబ్బకు రెండు పిట్టలు సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. ఒకటే విషయాన్ని ప్రకటించడం ద్వారా.. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి చేటు చేసే పెద్ద బూచిలాగా…

చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా గద్దె ఎక్కిన తరువాత అనేక విషయంలో ఒక దెబ్బకు రెండు పిట్టలు సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. ఒకటే విషయాన్ని ప్రకటించడం ద్వారా.. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి చేటు చేసే పెద్ద బూచిలాగా అభివర్ణించాలి. అదే సమయంలో అడ్డగోలుగా దోచుకోవడానికి వక్రమార్గాలకు దార్లు ఓపెన్ చేసుకోవాలి.. అనేదే చంద్రబాబునాయుడు కనిపెట్టిన నవీన సూత్రంలాగా వర్ధిల్లుతోంది.

జగన్మోహన్ రెడ్డి పరిపాలన రోజుల్లో ఆగిపోయిన అనేక నిర్మాణ పనులను తిరిగి ఇప్పుడు ప్రారంభిస్తున్నట్టుగా చంద్రబాబు ఊదరగొడుతున్నారు. అయితే ఆ పనులన్నింటిలోనూ కూడా.. బడ్జెట్ భారీగా పెంచేస్తున్నారు. జగన్ అప్పట్లో పని చేయకపోవడం వలన ఇప్పుడు నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయిందంటూ.. అడ్డగోలు దోపిడీ మార్గాలకు ఆయన సిద్ధపడుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అమరావతి నిర్మాణం గురించి తాజాగా మంత్రి నారాయణ చెప్పిన మాటలు ప్రజలకు కామెడీగా ధ్వనిస్తున్నాయి.

ఇంతకూ మంత్రి నారాయణ ఏం అన్నారంటే.. రాజధాని అమరావతి డిజైన్లలో ఎలాంటి మార్పులు ఉండవట. గత చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో ఎలాంటి డిజైన్లను అయితే రూపొందించారో.. వాటి ప్రకారమే ఇప్పుడు నిర్మాణాలు సాగుతాయట. ఐకానిక్ భవనాలు ఏపీ సచివాలయం, హైకోర్టు, శాసనసభ నిర్మాణాలు పాత డిజైన్ల ప్రకారమే ఉంటాయని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. బయటినుంచి డిజైన్లు అలాగే ఉంటాయని, ఇంటీరియర్ డిజైన్లు మారుతాయని ప్రకటించారు. ఆ మిషతో నార్మన్ పోస్టర్స్ ను మళ్లీ రంగంలోకి తెచ్చారు.

నిజం చెప్పాలంటే కేవలం ఇంటీరియర్ మార్పుల పేరు మీద అదొక అదనపు భారం. ఇప్పుడు నారాయణ అమరావతి నగరంలో డిజైన్ల మార్పు ఏమీ ఉండదని ప్రకటిస్తున్నారు. డిజైన్ల మార్పు ఉండదని ప్రకటించడానికి పెద్దగా కార్యకుశలత అక్కర్లేదు. చేతనైతే బడ్జెట్ లో మార్పులు ఉండవని మంత్రి నారాయణ చెప్పగలగాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.

అయిదేళ్లు పనులు జరగలేదు కనుక.. నిర్మాణ వ్యయం పెరిగిపోయింది.. ఇదంతా జగన్ చేసిన పాపం అని కబుర్లు చెప్పకుండా.. అదే బడ్జెట్ లో చేయగలరా? అనేది ప్రజల ప్రశ్న. ఇప్పుడు ఇసుక కూడా ఉచితంగా దొరుకుతున్నది గనుక.. నిర్మాణ వ్యయం తగ్గకపోయినా.. మార్పులేకుండా చేయగలిగితే మంచిదని అంటున్నారు.

పైగా నారాయణ నిర్మాణంలో ఏఐ టెక్నాలజీ వాడుతాం అని అంటున్నారు. ఆధునిక సాంకేతికతను వాడడం మంచిదే. అలా వాడడం అనేది.. వ్యయం తగ్గించడానికి ఉపయోగపడాలి గానీ.. ఆ ముసుగులో మరింత భారం మోపితే అది మోసమే అవుతుందని ప్రజలు అనుకుంటున్నారు.

12 Replies to “డిజైన్లు కాదుసార్.. బడ్జెట్లో మార్పుల్లేవని చెప్పగలరా?”

  1. Interior design మార్పులు అని చెప్పి ఇంకో 6 నెలలు delay చేస్తారా ? నారాయణ నారాయణ…

  2. కూటమి ప్రభుత్వం 2029 నాటి ఎన్నికలకు అభివృద్ధి పనులు గురించి చెప్పు కోనేవిధంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను

Comments are closed.