ఇదేంద‌య్యా.. బాబు లేని అమెరికా ఎన్నిక‌లా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడి ప్ర‌మేయం లేకుండా అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం ఆశ్చ‌ర్యంగా వుంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అమెరికాలో చంద్ర‌బాబునాయుడికి బ్ర‌హ్మాండ‌మైన ప్ర‌జాద‌ర‌ణ ఉన్న‌ట్టు, ఆయ‌న స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయి, రాజ‌మండ్రి…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడి ప్ర‌మేయం లేకుండా అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం ఆశ్చ‌ర్యంగా వుంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అమెరికాలో చంద్ర‌బాబునాయుడికి బ్ర‌హ్మాండ‌మైన ప్ర‌జాద‌ర‌ణ ఉన్న‌ట్టు, ఆయ‌న స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయి, రాజ‌మండ్రి జైల్లో ఉన్న‌ప్పుడు లోకానికి తెలిసింది.

ఎందుకంటే, ఏపీలో ఆయ‌న ఐటీ విప్ల‌వం తీసుకురావ‌డం వ‌ల్లే, ప్ర‌పంచ న‌లుమూల‌లా తెలుగు వ్య‌క్తులు ఉపాధి పొందార‌ని టీడీపీ విస్తృతంగా ప్ర‌చారం చేసుకునే సంగ‌తి తెలిసిందే. అందుకే బాబుకు ఖండాంత‌రాలు దాటినా ప‌లుకుబ‌డి వుంద‌ని చెప్ప‌డం. బాబు గొప్ప‌త‌నం గురించి తెలియ‌క అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న ట్రంప్‌, క‌మ‌లాహ్యారీస్ న‌ష్ట‌పోతార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ఇవాళ్టితో అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం ప‌రిస‌మాప్తం కానుంది. ఈ నెల 5న అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లంటే, ఆంధ్రా అసెంబ్లీ ఎన్నిక‌ల‌న్న టెన్ష‌న్ కనిపిస్తోంది. ఇప్ప‌టికే 6.8 కోట్ల మంది ఓట్లు వేశార‌ట‌!

అమెరికాలో ఈ ద‌ఫా అధికార మార్పిడి జ‌రుగుతుందా? లేదా? అధికారంలో ఏ పార్టీ వుంటే, మ‌న‌కు మేలు అనే అంశాల‌పై పే..ద్ద ఎత్తున మాట్లాడుకుంటాండారు. వేల మైళ్ల దూరంలో ఉండే అమెరికా ఎన్నిక‌లపై మ‌న‌కెందుకు ఆస‌క్తి? అంటే… ఉద్యోగ‌, ఉపాధి, విద్య , వ్యాపార త‌దిత‌ర రంగాల్లో ఇక్క‌డి కంటే ఆ దేశంలో మంచి అవ‌కాశాలుండ‌డంతో ఆశ‌ల‌కు రెక్క‌లు త‌గిలించుకుని వెళ్లారు. రానున్న రోజుల్లో వెళ్లాలంటే అమెరికా విధానాలు మ‌న‌కెంత వ‌ర‌కు దోహ‌దం చేస్తాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

డెమొక్ర‌టిక్ పార్టీ ప్ర‌స్తుతం అధికారంలో వుంది. అధికారం కోసం రిప‌బ్లికన్ పార్టీ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్ త‌న ప్ర‌త్య‌ర్థి అయిన డెమొక్ర‌టిక్ అభ్య‌ర్థి క‌మ‌లాహ్యారిస్‌తో పోరాడుతున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య పోరు మాత్రం… నువ్వానేనా అన్న‌ట్టు జ‌రుగుతాంద‌ని స‌ర్వే నివేదిక‌లు చెబుతున్నాయి.

అమెరికా అంటే అమ‌లాపురం అన్న‌ట్టుగా మ‌న తెలుగు వాళ్ల‌కు మాన‌సికంగా ద‌గ్గ‌రైంది. పెద్ద సంఖ్య‌లో భార‌తీయులు, మ‌రీ ముఖ్యంగా తెలుగు ప్ర‌జ‌లు అక్క‌డ బ‌తుకుతున్నారు. యూఎస్ జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం 2016లో తెలుగు వాళ్ల జ‌నాభా 3.2 ల‌క్ష‌ల మంది. 2024 సంవ‌త్స‌రానికి వ‌చ్చే స‌రికి ఆ సంఖ్య 12.3 ల‌క్ష‌ల‌కు చేరింది. నిజంగా ఈ పెరుగుద‌ల చాలా ఆశ్చ‌ర్యం క‌లిగించేలా వుంది. మ‌న‌కు అమెరికా ఎన్నిక‌ల‌పై ఎందుకంత ఆస‌క్తో ఈ జ‌నాభా లెక్క‌లే చెబుతున్నాయి.

కాలిఫోర్నియాలో అత్య‌ధికంగా 2 ల‌క్ష‌ల మంది తెలుగు ప్ర‌జ‌లున్నారు. ఆ త‌ర్వాత స్థానం టెక్సాస్‌ది. ఆ రాష్ట్రంలో 1.5 ల‌క్ష‌లు, న్యూజెర్సీలో 1.1 లక్షలు, ఇల్లినాయిస్‌లో 83వేలు, వర్జీనియాలో 73 వేలు, జార్జియా రాష్ట్రంలో 52 వేల తెలుగు ప్ర‌జ‌లు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చివుకుల ఉపేంద్ర ఇంత‌కు ముందు న్యూజెర్సీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అలాగే మేరిలాండ్ రాష్ట్రానికి ఏపీకి చెందిన అరుణ మిల్ల‌ర్ (అరుణ కాట్ర‌గ‌డ్డ‌) లెఫ్టినెంట్ గవర్నర్. అయితే మ‌న తెలుగు జ‌నాభాకు త‌గ్గ‌ట్టు రాజ‌కీయాల్లో లేరు. అమెరికా పౌర‌స‌త్వం వుంటేనే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అర్హ‌త వుంటుంది. అయితే మ‌న తెలుగు వాళ్ల‌కు చానా మందికి గ్రీన్‌కార్డు ఉంది. ఉత్త‌రాధితో పోలిస్తే, మ‌న తెలుగు వాళ్ల‌కి పౌర‌స‌త్వం లేదు. అందువ‌ల్ల ఎన్నిక‌ల్లో మ‌న‌వాళ్ల ప్ర‌భావం త‌క్కువే.

అయితే మొట్ట‌మొద‌ట అమెరికాకి వ‌ల‌స వెళ్లిన వాళ్ల‌లో క‌మ్మ‌, రెడ్డి సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వాళ్లే ఎక్కువ‌. మిగిలిన సామాజిక వ‌ర్గాలు వెళ్లిన‌ప్ప‌టికీ, వీళ్లంత కాదు అని అక్క‌డి గ‌ణాంకాలు చెబుతున్నాయి.

ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్న ట్రంప్‌, క‌మ‌లాహ్యారీస్‌… మ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, లోకేశ్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను మ‌రిచిపోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తాంది. వీళ్ల ప్ర‌భావం అమెరికాలో తెలుగు వాళ్ల‌పై చాలా ప‌డే అవ‌కాశం వుంది. ముఖ్యంగా చంద్ర‌బాబు సిల్క్ స్కామ్‌లో అరెస్ట్ అయిన‌ప్పుడు అమెరికాలోని ప్ర‌తి న‌గ‌రంలో పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ట్టు అప్ప‌ట్లో టీడీపీ అనుబంధ మీడియా వార్త‌ల్ని ప్ర‌చురించింది. త‌మ ఛానెల్స్‌లో ప్ర‌సారం చేసింది. అద‌న్న మాట చంద్ర‌బాబు కెపాసిటీ.

ఇటీవ‌ల లోకేశ్ అమెరికాలో ప‌ర్య‌టించారు కూడా. ట్రంప్‌, క‌మ‌లాహ్యారీస్ మ‌ద్ద‌తు అడిగి వుంటే. లోకేశ్ విస్తృతంగా ప్ర‌చారం చేసేవాళ్లు. దీంతో అమెరికాలో ఎన్డీఏ ప్ర‌భుత్వం ఏర్ప‌డి వుంటే… భారీగా నిధులు తీసుకొచ్చే అవ‌కాశం వుండేది. చంద్ర‌బాబును విస్మ‌రించిన దానికి మూల్యం ఎవ‌రు చెల్లిస్తారో చూడాలి. హేమిటో…త‌మ దేశంలో ఎవ‌రికి ఎలాంటి ప్ర‌జాబ‌లం తెలుసుకోలేని స్థితిలో ట్రంప్‌, క‌మ‌లాహ్యారీస్ పోటీ ప‌డుతున్నారు. ఇలాగైతే ఎట్ల‌బ్బా!

54 Replies to “ఇదేంద‌య్యా.. బాబు లేని అమెరికా ఎన్నిక‌లా?”

  1. నిజమె అందుకె జగన్ వెల్తున్నాడులె!

    అక్కడ కూడా ఇంగ్లిష్ మీడియం, ఒకటొ తరగతొలొనె Tofel, GRE శిక్షణ ఇప్పిస్టాడులె!

    1. అక్కడ మాత్రం రిషికొండ లొలా ప్యాలెస్స్ కట్టుకుంటా అంటె కుదరదు రొయ్!

  2. జగనన్న అయితే పుతిన్, జెలెన్స్కీ, మసూద్, నెతాన్యాహుని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని this is ఉలవచారు బిర్యానీ, this is ఆవకాయ బిర్యానీ అని కొసరి కొసరి వడ్డించేవాడు.

        1. గొర్రె బిడ్డ అయ్యుంటాడు, లాస్ట్ నేమ్ చూస్తే తెలిసిపోతుంది కదా..

  3. బాబు కంటే అన్న కి ఫాలోయింగ్ ఎక్కువేమో. అన్న విదేశాలకు వెళ్తే మోకాళ్ళ మీద నుంచొని దండాలు పెడతారు…ఒక సారి చెక్ చేయ రాదే

  4. GA నీ సైట్ లో వీడియో ఆప్షన్ ఉండే ఉంటె అప్లోడ్ చేసే ఉండేవాడిని సీబీన్ గురించి పంజాబ్ వాళ్ళు ఏమి మాట్లాడారో ..! అమెరికాలోని ఓ ప్రాంతంలో “టెస్లా” ఛార్జింగ్ స్టేషన్‌లో కారు ఛార్జింగ్‌కై వేచి ఉన్న తెలుగు ఎన్నారైతో ఒక పంజాబీ వ్యక్తి చంద్రబాబు గురించి ఏమన్నాడో ..”మీరంతా ఇక్కడుంది ఆయన చలవ వల్లే.. మీ తెలుగు వాళ్ళందరు చంద్రబాబు ఫోటో ఇంట్లో పెట్టుకు పూజించాలి”..

    ఇది కూడా అక్రమంగా అ రె స్ట్ అయ్యి జై ల్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన . అదే నెటిజనాలు ఆ వీడియో ని వైరల్ చేసే మార్ గుర్తుచేసుకుంటున్నారు .

  5. ఎవడో బిచ్చగాడు కూడా రోడ్డున పడి దణ్ణాలు పెట్టాడంట కదా, ఆ బిచ్చగాళ్ల సంగం నాయకుడు జగన్ కు విదేశాలకు వెళ్ళినపుడు. సాక్షి ప్రసారం చేసిందిలే.

  6. Idi over ayyinattu anipinchaleda neeku? Stalin, Rhul velli Kamala ki support chesinappudu em chesav. Inka Babu Trump ki support cheyyamani call ivvaledu santhoshinchi. Iste, mana Telugu vallu guddesevaru, aa vankatho Trump ni Amaravathi theesukuvachevadu President hoda lo. Chance miss ayyadu ane cheppavachu.

Comments are closed.