ఇక కొన్నాళ్లు ఇదే ఫార్ములా?

అయితే సస్సెన్స్ థ్రిల్లర్ లేదా మిస్టిక్ థ్రిల్లర్ కాదంటే మైథలాజికల్ టచ్ సినిమాలు ఇప్పుడు సక్సెన్స్ ఫార్ములా అనుకోవాలి.

తెలుగు నాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది. డ్రయినేజీ స్కీము లేక డేంజ‌రుగా మారుతోంది అన్నారు వెనకటికి ఓ కవి. తెలుగు నాట సంగతి అలా వుంచితే సినిమాల్లో మాత్రం మైథలాజికల్ టచ్ కొన్నాళ్లు కొనసాగేలా కనిపిస్తోంది. అదే బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములా అన్నట్లు మారుతోంది.

మైథలాజికల్ టచ్ లేదా డివోషనల్ టచ్ ఇస్తే సినిమా సూపర్ హిట్ నే. పురాణ పాత్రలను తీసుకువచ్చి, వర్తమాన కథలకు ముడిపెట్టి సినిమా తీస్తేనా.. ఏ గుడి లేదా జాతర కు సినిమా కథను లింక్ చేస్తేనా… ఇలా చాలా దారులు వున్నాయి ఈ గమ్యం చేరడానికి.

కార్తికేయ సినిమా. ఓ టెంపుల్ చుట్టూ వున్న థ్రిల్లింగ్ సస్పెన్స్ పాయింట్.

కార్తికేయ 2.. ద్వారక, కృష్ణుడి కథతో ముడిపడిన ఓ స్క్రిప్ట్.

హనుమాన్.. హ‌నుమంతుడితో ముడివేసిన ఓ ఫిక్షన్ కథ..

అర్అర్అర్… సీతారామరాజును రాముడిగా అంతర్లీనంగా చూపించిన వైనం

కల్కి… భారతంతో ముడివేసిన స్క్రిప్ట్… ఇలా కోట్ చేసుకుంటూ వెళ్లాలంటే ఇంకా ఎన్నో.

ఇప్పుడు వచ్చిన అజ‌య్ దేవగన్ సింగం అగైన్ నిండా రామాయణం రిఫరెన్స్ లే. లైన్ కూడా అలాంటిదే. దర్శకుడు తివిక్రమ్ కూడా మైథలాజికల్ టచ్ వున్న భారీ సినిమా అల్లు అర్జున్ తో చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ‌ లేటెస్ట్ గా నందమూరి మోక్షు ను పరిచయం చేయబోతున్న సినిమా కథకు, మహాభారతం అభిమన్యుడితో ముడి వుందని వినిపిస్తోంది. నిఖిల్ లేటెస్ట్ సినిమా స్వయంభు వస్తే దానికి ఇచ్చిన టచ్ ఏమిటో తెలుస్తుంది.

ప్రస్తుతం మైథలాజిటల్ టచ్ మిస్టిక్ థ్రిల్లర్ల కు టైమ్ నడుస్తోంది. ప్రస్తుతానికి కథాంశాలు తెలియవు కానీ, దాదాపు ఇలాంటి ‘టచ్’ సినిమాల కాలం మరో రెండు మూడేళ్లకు సరిపడా నడిచేలా వుంది. అన్ని సినిమాలు ప్లానింగ్ లో వున్నాయి. అయితే సస్సెన్స్ థ్రిల్లర్ లేదా మిస్టిక్ థ్రిల్లర్ కాదంటే మైథలాజికల్ టచ్ సినిమాలు ఇప్పుడు సక్సెన్స్ ఫార్ములా అనుకోవాలి.

24 Replies to “ఇక కొన్నాళ్లు ఇదే ఫార్ములా?”

  1. డ్రైనేజీ స్కీం ఉంటే దాన్లో పడేస్తావా రాబోయే మైథలాజికల్ సినిమా స్క్రిప్ట్ లను?

Comments are closed.