తండేల్.. విడుదల సమస్య ఏమిటి?

క్రిస్మస్ కు రావాల్సిన సినిమా తండేల్. సంక్రాంతికి వస్తుందనుకున్న తండేల్, ఎందుకు ఫిబ్రవరికి వెళ్లిపోయింది? చైతన్య- సాయి పల్లవి ఇద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. అతృతగా ఎదురుచూస్తున్నారు. గీతా సంస్థ నిర్మాణం కనుక…

క్రిస్మస్ కు రావాల్సిన సినిమా తండేల్. సంక్రాంతికి వస్తుందనుకున్న తండేల్, ఎందుకు ఫిబ్రవరికి వెళ్లిపోయింది? చైతన్య- సాయి పల్లవి ఇద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. అతృతగా ఎదురుచూస్తున్నారు. గీతా సంస్థ నిర్మాణం కనుక ఏ రకమైన సమస్యలు వుండడానికి అస్సలు అవకాశం లేదు. మరెందుకు అన్ సీజ‌న్ అని అభిమానులు అంతా అనుకుంటున్నా ఫిబ్రవరి 7 డేట్ కు ఫిక్స్ అయింది?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తండేల్ సినిమా షూట్ వర్క్ 15 నుంచి 20 రోజులు ఇంకా బకాయి వుంది. అది పెద్ద సమస్య కాదు. కానీ, సముద్రం మీద తీయాల్సిన సీన్లకు ఇండియన్ నేవీ నుంచి అనుమతులు కొన్ని బకాయిలు వున్నాయి. అవి రావాల్సి వుంది. అలాగే, వాఘా బోర్డర్ వద్ద కొన్ని సీన్లు తీసారో.. తీయాల్సి వుందో, అది కూడా అనుమతులు కావాల్సిన వ్యవహారం వుంది. అంతే కాకుండా సిజి వర్క్ ల సంగతి తెలిసిందే. అవి అన్నీ రావాల్సి వుంది.

ఇవన్నీ కలిపి అంచనా ప్రకారం సినిమా పూర్తి కావాలి అంటే జ‌నవరి 25 వస్తుందని తెలుస్తోంది. అందుకే ఇక తప్పని సరై ఫిబ్రవరి కి వెళ్లక తప్పిందని తెలుస్తోంది. ఇప్పటి నుంచి యుద్ద ప్రాతిపదికన పని చేస్తేనే ఫిబ్రవరి 7 కు రావడం కుదురుతుంది.

చైతన్య- సాయిపల్లవి ల కాంబినేషన్ లో శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జ‌రిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. అటు శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలు, మత్స్యకారుల జీవితాలు అన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి.

4 Replies to “తండేల్.. విడుదల సమస్య ఏమిటి?”

Comments are closed.