ఈసారి షారూక్ ను చంపేస్తాం..!

చంపేస్తామంటూ గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ను బెదిరించిన సంగతి తెలిసిందే. ఒకసారి కాదు, వరుసగా 2సార్లు సల్మాన్ కు బెదిరింపులొచ్చాయి. ఇప్పుడు షారూక్ వంతు. ఇతడికి కూడా చంపేస్తామంటూ…

చంపేస్తామంటూ గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ను బెదిరించిన సంగతి తెలిసిందే. ఒకసారి కాదు, వరుసగా 2సార్లు సల్మాన్ కు బెదిరింపులొచ్చాయి. ఇప్పుడు షారూక్ వంతు. ఇతడికి కూడా చంపేస్తామంటూ బెదిరింపులొచ్చాయి.

షారూక్ ఖాన్ కు ఓ కాల్ వచ్చింది. “త్వరలోనే చంపేస్తాం, రెడీగా ఉండు” అనేది ఆ కాల్ సారాంశం. దీంతో అతడు ముంబయిలోని బాంద్రా పోలీసుల్ని ఆశ్రయించాడు. వెంటనే దర్యాప్తు చేసిన పోలీసులు, రాయ్ పూర్ కు చెందిన ఫైజాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై షారూక్ ఇంకా స్పందించలేదు.

నిజానికి షారూక్ కు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం ఇదే తొలిసారి కాదు. పఠాన్, జవాన్ సక్సెస్ తర్వాత తనకు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యానని షారూక్ గతంలో ప్రకటించాడు. దీంతో గతేడాది అతడికి భద్రతనిచ్చారు. తాజా బెదిరింపు కాల్ తో షారూక్ భద్రతను మరింత పెంచారు పోలీసులు.

గతేడాది అక్టోబర్ నుంచి వై-ప్లస్ సెక్యూరిటీలో ఉంటున్నాడు షారూక్. ఇప్పుడు దాన్ని అప్ గ్రేడ్ చేశారు. భద్రతా కారణాల వల్ల తన పుట్టినరోజు నాడు ఇంటికొచ్చిన అభిమానుల్ని సైతం షారూక్ పలకరించలేకపోయాడు.

బాబా సిద్ధిఖీ హత్య జరిగిన కొన్ని వారాలకే ఇటు షారూక్, అటు సల్మాన్ కు వరుసపెట్టి బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులపై నిఘాను మరింత పెంచారు.

4 Replies to “ఈసారి షారూక్ ను చంపేస్తాం..!”

  1. ఇన్నాళ్లూ సలీమాన్ కి గురిపెడుతుంటే కప్పలు, కాకులు చచ్చిపోతున్నాయి. ఇప్పుడు షారుఖ్ కి గురిపెడ్తినన్నా గుండు సల్మాన్ కి తగిల్తేమోనన్న ఒక అల్ప ఆశ.

Comments are closed.