ఎంతోమంది సినీ ప్రేమికులు కోరుకునే కాంబినేషన్లలో ఇది కూడా ఒకటి. నిజంగా వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే అది చాలా భిన్నంగా, ప్రత్యేకంగా ఉండేది. దీనిపై రాజమౌళి స్పందించాడు. సూర్యతో సినిమా చేయలేకపోయానని అన్నాడు.
“నేను, సూర్య కలిసి సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ కుదర్లేదు. రాజమౌళితో సినిమా చేసే ఛాన్స్ మిస్సయ్యానని ఏదో ఫంక్షన్ లో సూర్య చెప్పాడు. కానీ సూర్యతో సినిమా చేసే ఛాన్స్ ను నేను కోల్పోయాను అని భావిస్తాను. ఎందుకంటే, సూర్యను నేను అంత ప్రేమిస్తాను. అతడి స్టోరీ సెలక్షన్ అంటే నాకు చాలా ఇష్టం.”
ఇలా సూర్యతో సినిమా చేయలేకపోయిన విషయాన్ని బయటపెట్టాడు రాజమౌళి. అటు సూర్య కూడా ఈ అంశంపై స్పందించాడు. రాజమౌళి కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నట్టు ప్రకటించాడు.
“రాజమౌళి అనే ట్రైన్ ను నేను మిస్సయ్యాను. కానీ ఇప్పటికీ నేను ఆ ట్రైన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను.” అంటూ ప్రకటించాడు సూర్య.
కంగువా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో సెలబ్రేట్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చాడు రాజమౌళి. మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు సంబంధించి ఆయన ఎలాంటి అప్ డేట్ లేదా లీడ్ ఇవ్వలేదు.
Call boy jobs available 9989793850
Fake
vc estanu 9380537747