వివాదాస్పదమౌతుందని తెలిసినా, కొన్నిసార్లు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు నిర్మాత దిల్ రాజు. ఈసారి కూడా ఆయన అదే పని చేశారు. చిన్న సినిమాల ప్రచారానికి సెలబ్రిటీలు రావడం లేదనే విమర్శపై సూటిగా స్పందించారు. ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎవ్వర్నీ సపోర్ట్ చేయరని ఓపెన్ గా ప్రకటించారు.
“చిన్న సినిమాల ప్రచారానికి సెలబ్రిటీలు రావడం లేదంటున్నారు కొంతమంది. ఆమధ్య కిరణ్ అబ్బవరం ఆవేదన కూడా ఓ వీడియోలో చూశాను. ఇక్కడ ఎవరికివారు ప్రూవ్ చేసుకోవాలి. ఎవడో ఏదో అంటున్నాడని భయపడకూడదు. టాలెంట్ ఉంటే సక్సెస్ అవుతారు. ఇక్కడ ఎవ్వరూ ఎవ్వడ్నీ సపోర్ట్ చేయరు.”
ఎమోషనల్ అయితే ఉపయోగం లేదంటున్నారు దిల్ రాజు. సక్సెస్ వచ్చినప్పుడు పెద్దలు కొంతమంది వచ్చి అభినందిస్తారని.. అంతకుమించి ఇండస్ట్రీలో ఎవ్వరూ ఏమీ చేయరని అన్నారు.
“ఎవరో ఏదో చేస్తారని ఆశిస్తుంటారు. అది తప్పు. ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయరు. మమ్మల్ని వెనక్కు లాగేస్తున్నారు, సపోర్ట్ చేయరని అంటుంటారు. ఎవ్వరూ వెనక్కు లాగరు, ఎవ్వరూ సపోర్ట్ చేయరు. ఎవరూ ముందుకురారు. ఎవరి బిజీ వాళ్లది, ఎవరి జీవితాలు వాళ్లవి, ఎవరి సినిమాలు వాళ్లవి.”
ప్రచారానికి సెలబ్రిటీలు వచ్చారా లేదా అనేది ముఖ్యం కాదు. ఎలాంటి సినిమా తీశామనేది ముఖ్యం. కంటెంట్ బాగుంటే సెలబ్రిటీలు ప్రచారం చేయకపోయినా సినిమా ఆడుతుందని, కాబట్టి సెలబ్రిటీల కోసం ప్రయత్నించకుండా, మంచి కంటెంట్ కోసం కష్టపడాలని ఔత్సాహిక మేకర్స్ కు పిలుపునిచ్చారు దిల్ రాజు.
మంచి సినిమా లని ప్రమోట్ చేయడానికి…మా లాంటి కామన్ ఆడియెన్స్ తప్పించి… సెలబ్రెటీ లు, లెజెండ్ లు ఎవరుంటారు…
ఎవడి కష్టం వాడిది… ఎవడి ప్రతిఫలం వాడిది. ఎవడి లైఫ్ వాడిది… ఎవడి బిజీ వాడిది. వాడెవడో నీకోసం ఎందుకు రావాలి… నీవల్ల వాడికేదో ఉపయోగం ఉంటే తప్ప… లేదా నీ సినిమా ప్రమోట్ చేయడంలో వాదికేదో సొంత ప్రయోజనం ఉంటే తప్ప… సో మానవా… నీ కష్టం నువ్వే పడు. నిన్ను నువ్వే ప్రూవ్ చేసుకో… బాగుంటే ప్రేక్షకులే నెత్తిన పెట్టుకొని మోస్తారు… లేదంటే అదే ప్రేక్షకులు పూడ్చి పెడతారు.
Call boy jobs available 9989793850
vc available 9380537747