ట్రంప్ ఎన్నిక చాలా సంతోషాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కలిగించింది. లోకంలో పిచ్చోళ్లే ఎక్కువ ఉన్నారని నా నమ్మకం. నేనూ ఒకడు కావచ్చు. అమెరికా ఈ ప్రపంచానికి పెద్దన్న అయితే, ట్రంప్ బిగ్‌బాస్. వెర్రి వాళ్లకి వెర్రివాడే రాజుగా వుండడం కరెక్ట్.
అమెరికా అంటే మన దృష్టిలో స్టేటస్ సింబల్. పిల్లలు అక్కడున్నారంటే పల్లెలోని రచ్చబండ దగ్గర కూడా పిలిచి సీటు ఇస్తారు. మా వాడు, మా అమ్మాయి అంటూ కోతలు కోయచ్చు. పల్లెల్లో వరికోతల కంటే ఇవే ఎక్కువ ఇప్పుడు. పిల్లలు కూడా చిలుకూరులో దేవుడు చుట్టూ తిరిగి, తిరుమలలో పొర్లు దండాలు పెట్టి వీసాలు సంపాయిస్తారు. ఎయిర్‌పోర్టులో వీడ్కోలు కన్నీళ్లలో చాలా మంది జారిపడుతూ వుంటారు. విమానం ఎక్కగానే అమెరికా అని ఆనందంలో, మళ్లీ వాళ్లు ఎప్పుడొచ్చినా చుట్టపు చూపేనని విషాదాన్ని మరిచిపోతాం. డాలర్ వుంటే కాలర్ ఎగరేసుకు తిరగొచ్చు డాలర్ గుర్తు ఎస్ అనే అక్షరానికి నిలువు కోత. అదో అర్ధ సత్యం. సగం ఔను, సగం కాదు. పూర్తి నిజం ఎవరూ చెప్పరు.
డబ్బున్న వాళ్లంతా తెలివైన వాళ్లని మన నమ్మకం. తెలివి లేని వాళ్లకి డబ్బు రాదు. అమెరికా తెలివైన దేశం. బీద ఆఫ్రికా దేశాలు తెలివిలేనివి. డబ్బు, తెలివి సమానార్థకాలు. తెలివైన అమెరికా, తెలివిలేని ట్రంప్‌ని ఎందుకు ఎంచుకుందని కొందరు అమాయకులు ప్రశ్నిస్తున్నారు. వీళ్లు గత కాలం మనుషులు. ఈ ప్రపంచంలో ఏ జరుగుతోందో అర్థం కాదు, అర్థం చేసుకోలేరు. చెదలు మాదిరి పూర్వ జన్మలో కొన్ని పుస్తకాలు సగం సగం తినేసి, వినికిడి జ్ఞానం ఆధారంగా ఈ భూమ్మీద కొత్త మార్పులొస్తాయని, అందరూ కడుపు నిండా తిండి తింటారని నిద్రలో కలవరిస్తూ వుంటారు. మార్క్స్ చెప్పిన పెట్టుబడి అని దీర్ఘం తీసి, అపస్మారక స్థితి వీళ్లకి అర్జెంట్‌గా తులసీ నీళ్లు అవసరం. మార్క్స్‌ని భూమిలో పాతిపెట్టి 140 ఏళ్లు అయ్యింది. పెట్టుబడి ఏలుబడిగా మారి యుగాలు దాటింది.
ప్రపంచం అంతా ఒకటే ఫార్ములా. మన వార్డులో ఇద్దరు రౌడీలు కౌన్సిలర్లగా నిలబడితే అందులో పెద్ద రౌడీని గెలిపిస్తాం. ఒకవేళ వీళ్ల ఇద్దరికీ పోటీగా మంచోడు నిలబడితే , ఆ అవకాశం లేదు, నిలబడిన మరుక్షణం కాళ్లు విరగ్గొట్టి మూల కూచోపెడతారు. కుంటుతూ వెళ్లి నామినేషన్ వేస్తే, వాడికి డిపాజిట్ పోగొట్టి, బుద్ధి చెప్పి, ఆ రాత్రికి మధుశాల బార్‌లో పార్టీ చేసుకుని మెట్ల మీద దొర్లుకుంటూ ఇంటికెళ్తాం. మంచోడు ఎప్పటికీ రాజకీయాల్లోకి రాకుండా వుండడానికి వాడి ఇంటి ముందు ధర్నా చేస్తాం. సోషల్ మీడియా పోస్టులు పెట్టి, ఇంటిల్లిపాదిని వణికిస్తాం. రాజకీయాల్లోకి మేసేవాడు వస్తే మనకింత గడ్డి పెడ్తాడు. తిను, తినిపించు. చిల్లర విసిరి, నోట్లు ఏరుకో.
ట్రంప్ వ్యాపారంలో వేల కోట్లు సంపాయించాడు. లైంగిక ఆరోపణలు ఉన్నాయి. క్రిమినల్ కేసులున్నాయి. ఓడినా దబాయించి గెలిచాను అనగలడు. తిక్క, వెర్రి, పిచ్చి అన్నీ కలిపి వ్యవహరించగలడు. ఇంతకు మించిన అర్హత ఏముంది? అన్ని దేశాల్లో, అన్ని ఊళ్లలో వీళ్లే కదా ఉన్నారు!
అమెరికా దారిలోనే ప్రపంచం నడుస్తుంది. ప్రపంచాన్ని అమెరికా నడిపిస్తుంది. ట్రంప్ కరెక్ట్ నమూనా. అతని దగ్గర వేల ట్రంప్ కార్డులున్నాయి. క్రికెట్ గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఆడగలడు. కాకపోతే బాల్‌కి బదులు భూగోళం వుంటుంది.
చిన్నప్పుడు అన్నం తినకపోతే పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్లు వస్తారని భయపెట్టేవాళ్లు. ఎవడూ ఎత్తుకుపోకుండానే పెరిగి పెద్దవాళ్లయ్యాం.
న్యూయార్క్ హార్బర్‌లో ఒకావిడ విగ్రహం వుంటుంది. చేతిలో కాగడాతో పిలుస్తూ వుంటుంది. మన దేశంలోని పిల్లలందరినీ ఎత్తుకుపోయే పనిలో వుంది.
జీఆర్ మహర్షి
పిచ్చోడి చేతిలో పిచ్చివాళ్ళ స్వర్గం……
Avunu, 3 years paapalani (pillalani) kooda vadalani pichivalla swargam. Daanini kooda rajakeeyaniki vaadukune pichivalla swargam. Prathi chota muriki gabbu kotte pichivalla swargam.
Chettha article, Maharshi! Picchi rathalu rayadam maani maa time waste cheyyaku!
haahhahahaahaha
Ikkada Chala mandi abhimanulunnaru. Vallu hurt avtaru ilantivi raaste.
Trump win tarvata evaro(Indian living in India) rasadu. “Trump is the legit president a country should have” Ani. Reason: Trump doesn’t believe in climate change and endorses fossil fuels Ani.
Manavallu chaala mandi verripookulu. Alantivallallo vaadokadu!
ఛాలా మంది ఇండియన్ citizens వాడికి వోటు వేశారు, ఎందుకంటే h1 తో ఆపుతాడుట. ఇంటిలో ఆడావాళ్ళు , ఎలా పోయిన పరవాలేదు, నా మగతనం నిలవాలి అనుకునే మడ్డ లేగవని మగవాళ్ళు వాడికి వోటూ వేశారు
Trump america first maana pani manam ceskundam .. mana gola manam choosukundamm .pakkinti vyavaharalu yekkuva kelakoddu antunnadu.. meekenti noppi ?
Babu, nuvvu policies etc terichi chudu + vaadi panikimalina past paripalana chudu. Alage, vaadu elantodo vaadi vyakthigatha jeevitham entha daarunamaindo, vaadi meeda lekkaku lennai cases elantivi etc chudu. Nenu hardcore democrat kadu, kanee janalu chalamandi ee sari KH ki vote veyyakunda intrlo kurchunnaru. DT gadiki eppudu pade votes e mallee paddayi, inchuminchuga. Janalu Biden and corporate stooges chesina gaslighting and democracy ki viluva ivvakunda KH ni annoint chesina paniki, alage economy and illegal immigration meeda kasitho vote veyyaledu, leda vaadiki vesaru. That’s all!
ఏమి సెప్తున్నారు సారు.. ట్రంప్ ని మించి సంపాదించి సీఎం లు అయిన వాళ్ళు పుట్టిన నేల మనది
yuvaru?? chandra baba?
Trump won because
1) Illegal immigration is illegal.
2) Men shouldn’t be in women sports.
3) Unnecessary wars promote inflation.
This is a biased world and everyone will not accept what is written in this article. We are all selfish and always think what benefit us. I think most of the people who comment here are affiliated to a political party and get paid for their comments. I am clarifying that I am not affiliated to any political party.
One party affiliated guy won’t acknowledge that his/her party guys earned illegal money while accusing other parties guys. All are same and from same cloth but forget or ignore. Unfortunately we are living in a concrete jungle and only survival of the fittest. This is the world phenomenon and either in India or elsewhere it is same.
As it said in Hindu philosophy karma prevails.
DT lantodini chusthe, Karma vaadiki antadu but kharma matram manaki pattukuntundi anipistundi. These people are some of the most vile elements in society but when the so-called good guys do not do what’s right and just diddle with people’s emotions while enriching themselves under the guise of some identity politics, gaslighting the public etc, people get desperate and they take drastic decisions. America is at a precipise b/c the general public were just sick of the statusquo. They’ve now officially voted for the face-eating cheetah party and they’ll be eaten alive!
ఇదే ఆర్టికల్ ట్రంప్ కాకుండా జగన్ పైన రాసి ఉంటే సరిగ్గా సెట్ అవుతుంది
kamma jindabad…jai bheem
vc estanu 9380537747
మహర్షి గారి ఆణిముత్యాలు – గజి బిజీ మేళం , గందర గోళం .
Avasarama? There are two constitutions in USA just like India has J&K. Not even President can touch the elites , the swamp. Trump symbolically drove Dump truck. Hope he will survive for 4 years.