కల్కి-2.. దీపిక పాత్ర ట్రిమ్ అవుతుందా?

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమైంది హీరోయిన్ దీపిక పదుకోన్. ఈమధ్య కూతురు పేరును బయటపెట్టిన దీపిక, ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచంలోకి వస్తోంది. Advertisement అయితే ఆమె ఇప్పట్లో తిరిగి సినిమాల్లోకి వచ్చే…

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమైంది హీరోయిన్ దీపిక పదుకోన్. ఈమధ్య కూతురు పేరును బయటపెట్టిన దీపిక, ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచంలోకి వస్తోంది.

అయితే ఆమె ఇప్పట్లో తిరిగి సినిమాల్లోకి వచ్చే ఆలోచన చేయడం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తిరిగి సెట్స్ పైకి రావడానికి దీపిక చాలా టైమ్ తీసుకోబోతోందనేది ఆమె క్లోజ్ సర్కిల్ మాట.

మరి కల్కి-2 సంగతేంటి..

దీనికి సంబంధించి బాలీవుడ్ నుంచి కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. కావాలంటే షూటింగ్ ప్రారంభించుకోవచ్చని, అవసరమనుకుంటే తన పాత్రకు కొన్ని మార్పుచేర్పులు చేసి ట్రిమ్ చేసుకోవచ్చని కూడా యూనిట్ కు దీపిక సూచించిందంట.

అయితే కల్కి యూనిట్ మాత్రం దీన్ని వ్యతిరేకించిందంట. కథ-స్క్రీన్ ప్లేలో.. మరీ ముఖ్యంగా దీపిక పోషిస్తున్న సుమతి పాత్రలో ఎలాంటి మార్పుచేర్పులు, కత్తిరింపులు ఉండవని.. ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడే షూటింగ్ ఉంటుందని దీపికకు క్లియర్ గా చెప్పినట్టు తెలుస్తోంది.

కల్కి-2 సెట్స్ పైకి రావడానికి చాలా టైమ్ పడుతుందని నాగ్ అశ్విన్ రీసెంట్ గా ఓ మూవీ ప్రమోషన్ లో బయటపెట్టిన సంగతి తెలిసిందే. స్క్రీన్ ప్లే సిద్ధంగా ఉన్నప్పటికీ.. మళ్లీ సెట్ వర్క్ మొదలుపెట్టాలని, మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని నాగ్ అశ్విన్ ప్రకటించాడు.

ఇటు ప్రభాస్ కూడా ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజాసాబ్, ఫౌజి సెట్స్ పై ఉన్నాయి. ఏ నిమిషంలోనైనా స్పిరిట్ సినిమా మొదలయ్యేలా ఉంది.

6 Replies to “కల్కి-2.. దీపిక పాత్ర ట్రిమ్ అవుతుందా?”

    1. కానీ ఆమెకి ఆల్రెడీ చాలా కోట్లు ఇచేసుంటారుగా. మారిస్తే మళ్ళీ రెమ్యునరేషన్ ఇచ్చు కోవాలి

Comments are closed.