దేవీశ్రీ.. హమ్మయ్య.. ఓ పనైపోయింది

దేవీ స్టేజ్ మీద ఆలస్యంగా రావడానికి వివరణ ఇచ్చారు కానీ ఆలస్యంగా ట్యూన్ లు, ఆలస్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం మీద మాత్రం ఏమీ చెప్పలేదు

మనసులో మాట కక్కేస్తే ఓ పనైపోతుంది. సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ అదే పని చేసారు. పుష్ప 2 చెన్నయ్ ఫంక్షన్ లో తన మనసులోని మాటలు బయట పెట్టేసారు. నిర్మాతలకు తన మీద చాలా కంప్లయింట్ లు వున్నాయని, టైమ్ కు ట్యూన్ ఇవ్వలేదు. టైమ్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు. టైమ్ కు ఫంక్షన్ కు రాలేదు అంటారు అంటూ చెప్పుకోచ్చాడు.

సరే, దేవీ తన మనసులో మాట కక్కేసాడు. బాగానే వుంది. కానీ తన మీద వున్న ఫిర్యాదులు నిజమో కాదో కూడా చెప్పాలి కదా.

టైమ్ కు ట్యూన్ లు, స్కోర్ లు ఇవ్వరు అనే కంప్లయింట్ కేవలం దేవీ మీద మాత్రమే కాదు, థమన్ మీద వుంది. అందరికన్నా ఎక్కువగా అనిరుధ్ మీద వుంది. కానీ నిర్మాతలు, దర్శకులు భరిస్తారు. భరిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది సరైన మ్యూజిక్ డైరక్టర్లు లేని కారణంగా. ఈ ముగ్గురు మ్యూజిక్ డైరక్టర్లలో అనిరుధ్ అయితే నరకమే అని నిర్మాతలు అంటూ వుంటారు. అతను ఇచ్చినపుడే తీసుకోవాలి, దానికి అనుగుణంగానే డేట్ వేసుకోవాలి.

దేవీ కి త్రివిక్రమ్ కు ఎందుకు దూరం పెరిగింది. ఎన్నో మంచి హిట్ లు వున్నాయి వారి కాంబినేషన్ లో. మరి ఇప్పుడు ఎందుకు దూరం అయ్యారు. టైమ్ కు కంటెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్డడం వల్లనే అని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.

అంతే కాదు సుకుమార్ కు ఇచ్చినట్లు, పెద్ద సినిమాలకు పాటలు ఇచ్చినట్లు మిగిలిన వారికి ఇస్తారా? ఎన్ని ఉదాహరణలు వున్నాయి ఈ విషయంలో. పుష్ప2 సంగతే చూద్దాం. ఎప్పటి నుంచి సెట్ మీద వుంది. అంటే ట్యూన్ లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి అంతకు అంతా సమయం దేవీకి దొరికినట్లే కదా. అయినా మరి ఆలస్యం ఎందుకు అయింది? తొలిసగం తన దగ్గర పెట్టుకుని, సమయానికి ఆర్ఆర్ ఇవ్వకుండా స్టేజ్ షో లు చేసుకుంటున్నారని కదా వినవచ్చిన కంప్లయింట్.

దేవీ స్టేజ్ మీద ఆలస్యంగా రావడానికి వివరణ ఇచ్చారు కానీ ఆలస్యంగా ట్యూన్ లు, ఆలస్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం మీద మాత్రం ఏమీ చెప్పలేదు. అక్కడే అర్థం అయిపోతోంది. అసలు విషయం.

8 Replies to “దేవీశ్రీ.. హమ్మయ్య.. ఓ పనైపోయింది”

      1. Hahaha nice reply. But content and talent plays imp role if not we lose .you take Malayalam movies they complete them in 7. Crores with nice content of it works out you get 10 times profit otherwise you lose nothing

Comments are closed.