నారాయణ మాటలు చంద్రబాబు చెవికెక్కుతాయా?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాధారణంగా తాను ఏదైనా నిర్ణయం తీసుకోదలచుకుంటే.. ముందుగా దానిని తనకు అనుకూలురైన ఇతర పార్టీల నాయకుల నుంచి డిమాండ్ రూపంలో వచ్చేలా చూసుకుంటారని, ఆ డిమాండ్ పట్ల పబ్లిక్ లో స్పందన…

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాధారణంగా తాను ఏదైనా నిర్ణయం తీసుకోదలచుకుంటే.. ముందుగా దానిని తనకు అనుకూలురైన ఇతర పార్టీల నాయకుల నుంచి డిమాండ్ రూపంలో వచ్చేలా చూసుకుంటారని, ఆ డిమాండ్ పట్ల పబ్లిక్ లో స్పందన ఎలా ఉందో గమనించి అప్పుడు నిర్ణయం తీసుకుంటారని ఒక పేరుంది. ఇది పాలకులకు సాధారణ వ్యూహమే కావొచ్చు. కానీ.. ఇప్పుడు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వినిపిస్తున్న డిమాండ్ ను మాత్రం అసలు చంద్రబాబునాయుడు చెవిన వేసుకుంటారా? అసలు పట్టించుకుంటారా? లేదా? అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.

అనేక సమకాలీన అంశాల మీద తన గళం వినిపిస్తూ ఉండే సీపీఐ కె.నారాయణ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడినుంచే ఆయన అదానీ ముడుపుల వ్యవహారంపై ఒక వీడియో విడుదల చేశారు. దేశంలో నాలుగు రాష్ట్రాలకు 2100 కోట్ల ముడుపులు, అందులోనూ ఏపీ మాజీ సీఎం జగన్ కు రూ.1750 కోట్ల మేర ముడుపులు ఇచ్చినట్టుగా అమెరికాలోని ఎఫ్‌బిఐ తేల్చిన తర్వాత.. వ్యవహారం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అమెరికా పర్యటనలోనే ఉన్న కె నారాయణ తనదైన శైలిలో స్పందించారు.

ఈ ముడుపులు ఇవ్వడం ద్వారా రాష్ట్రంపై లక్షకోట్ల రూపాయల భారం మోపేందుకు కుట్ర జరిగిందని అంటున్నారు. గత ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందాలను ఏపీ ప్రభుత్వం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అదానీపై అమెరికాలో నమోదు అయిన కేసుల విషయంలో ప్రధాని నరేంద్రమోడీ కూడా జోక్యం చేసుకోకూడదు అని నారాయణ డిమాండ్ చేస్తున్నారు.

అయితే నారాయణ డిమాండ్ రాష్ట్రంలో వామపక్షాలకు చెందిన పలువురు నేతల నుంచి వినిపిస్తోంది. పార్టీ రాష్ట్ర నాయకులు రామకృఫ్ణ తదితరులు కూడా ఇదే డిమాండ్ వినిపించారు. మరి ఇప్పుడు చంద్రబాబునాయుడు ఆ డిమాండ్ల మేరకు సెకితో ఒప్పందాలను రద్దు చేసుకోవడనికి సిద్ధమేనా అనేది ప్రజల ముందు మెదలుతున్న సందేహం.

అదానీతో సత్సంబంధాలకోసం పరితపించిపోతూ ఉండే చంద్రబాబునాయుడు సర్కారు.. అదానీకి నొప్పి కలిగించే నిర్ణయం తీసుకోగలదా? అనే చర్చ రాజకీయాల్లో నడుస్తోంది. అయితే ఒప్పందాల రద్దు చేయబోం అన్నట్టుగా చంద్రబాబు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అయితే.. రద్దు చేస్తే తప్ప తమ ప్రభుత్వం పరువు నిలవదని ఎన్డీయే కూటమి పార్టీల నాయకులే అనుకుంటున్నారు. మరి పరిణామాలు ఎటు దారితీస్తాయో వేచిచూడాలి.

28 Replies to “నారాయణ మాటలు చంద్రబాబు చెవికెక్కుతాయా?”

  1. లె..1 నీ జైల్ కూడా పెట్టమంటున్నారు..అది మాత్రం మింగేసి రద్దు మాత్రం చెప్తావు..

  2. లె..1 నీ @జైల్ కూడా పెట్టమంటున్నారు..అది మాత్రం మింగేసి రద్దు మాత్రం చెప్తావు..

    1. 🤣🤣🤣 అది వీడు రాయకపోయినా జరుగుతుందని ఈ శుంఠ భావం అనుకుంట సర్!!

  3. లంచం తీసుకున్నట్టు.. జగన్ రెడ్డి సాక్ష్యం ఇస్తే.. అదానీ తో ఒప్పందాలు రద్దు చేసేసుకోవచ్చు..

    ఎఫ్బిఐ చెప్పిందని.. అదానీ తో ఒప్పందం రద్దు చేసుకున్నాక.. జగన్ రెడ్డి లంచం తీసుకోలేదని ప్లేట్ ఫిరాయిస్తే.. నష్టం ప్రజలకే కదా..

    ఇప్పుడు జగన్ రెడ్డి చేసిన తప్పు ని సిగ్గు లేకుండా ఒప్పుకుంటే.. రాష్ట్రానికి నష్టం లేకుండా చంద్రబాబు అదానీ తో ఒప్పందాలు రద్దు చేసుకొంటారు..

    ..

    విన్ విన్ సిట్యుయేషన్..

      1. ఒప్పందం చేసే నాటికే .. మార్కెట్ విలువ 1.9 గా ఉన్నట్టు నిన్న ఈనాడు లో క్లియర్ గా లెక్కలతో సహా ఇచ్చారు..

        1. కానీ అది గు జరత్ కు ఇచ్చారు. ట్రాన్స్మిషన్ కాస్ట్ ఒక్కో స్టేట్ కు ఒక్కోలా ఉంటుంది గదా మార్చి పోకూడదు

          1. సర్.. మార్కెట్ వేల్యూ అని క్లియర్ గా చెప్పాను.. అందులో ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఉండవు..

            ఈ మార్కెట్ వేల్యూ ని నెక్స్ట్ 10 ఇయర్స్ కి ఫిక్స్డ్ ప్రైస్ గా ఇచ్చారు.. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ని ఫిక్స్డ్ గా ఇవ్వడం కుదరదు..

          2. సర్ కరెంటు కాస్ట్ మాత్రమే 2 .49 ట్రాన్స్మిషన్ కాస్ట్ సెపరేట్ గ మూడు రూపాయల వరకు ఉంది ( 3.29 అనుకుంట)

  4. ఇదే నారాయణ అధికారం లో ఉన్నపుడు జగన్ కి ఏమైనా సలహా ఇస్తే బాబు సామాజికవర్గం వాడు అని రాశి సరిపెట్టేసావు కదర GA

  5. Adani ని కేరళ కూడా ఆహ్వానించారు, వాళ్ళ పోర్ట్ ప్రారంభం అయినపుడు క్రెడిట్ కోసం పోటీ పడ్డారు.

  6. That agreement is with SECI which is a Central government agency. So, Kootami is still reading and studying the details. If stopped it is like directly saying that the Central agency did something wrong. Narayana is just shouting becuase his party is anti-BJP.

  7. “ఈ ముడుపులు ఇవ్వడం ద్వారా రాష్ట్రంపై లక్షకోట్ల రూపాయల భారం మోపేందుకు కుట్ర జరిగిందని అంటున్నారు”..

    the fact that GA is reporting this is an indication that real Reddy community has begin to disassociate from che ddi gang…

    Reddys – reclaim your community honor for this horror show for last 15years

  8. Adhani మీద ఆరోపణలు చేయడం అమెరికా లో డీప్ స్టేట్ కు అలవాటు గా మారి పోయింది అందులో కొత్తేమీ లేదు. ప్రతి పార్లిమెంట్ సెషన్ కి సరిగా రెండు రోజులకి ముందు ఇలాంటివి వస్తాయి. అబ్జర్వ్ చెయ్యండి పైగా జగన్ ఏమి 10 ruaoyilakj కొనలేదు 2.5 రూపాయిలు కు కొన్నారు . ఇది బాగా తక్కువ రెట్ కదా .అన్నిటికీ ఇలా బురద జల్లి పారిశ్రామిక వేత్త లను అనడం తగదు

  9. అయితే ఆంధ్ర లో కట్టిన కృషణ పట్నం పోర్ట్ గంగా వరం పోర్ట్ ల విషయం లో జగన్ అదాని కలిసి పని చేసారు కానీ అలాంటి వాటికి ప్రూఫ్ ఉండదు .పరiశ్రమలు వచ్చేటపుడు ఇలాంటివి జరుగుతాయి .కానీ మనకు ఉద్యోగాలు taax లు వస్తాయి కదా అదే చూడాలి

  10. జగన్ కొన్న కాస్ట్ 2.5 rupees mi6 adhemi ఎక్కువ కాస్ట్ కాదు .అప్పుడు ఉన్న రెట్ సౌమారు అంతే గా ఉంది. గుజరాత్ కు 2 ruaoyikali ఇచ్చారు. పైగా మనం కొన్నది సెకి దగ్గర నుండి . అంటే కేంద్రం దగ్గర నుండి . సో ఇప్పుడు చేసేదేమి లేదు .ఇదంతా దీప్ స్టేట్ కుట్ర. ఇండియా లో పార్లిమెంట్ ఎషన్ కు ముందర అధని మీద ఇలాంటివి వస్తూ ఉంటాయి

Comments are closed.