రేవంత్ ధైర్యం.. చంద్రబాబుకు లేదు!

అదానీ నుంచి విరాళం తప్ప.. ఆయన కంపెనీలకు ఒక్క గుంట భూమి కూడా తమ ప్రభుత్వం ఇవ్వలేదని స్పష్టం చేశారు.

గురువును మించిన శిష్యుడు అని పలు విధాలుగా తనను తాను నిరూపించుకుంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఎక్కడ ప్రారంభం అయినప్పటికీ.. ఆయన వెలుగులోకి వచ్చింది మాత్రం.. తెలుగుదేశంలో ఉన్న రోజుల్లోనే.

చంద్రబాబును ఆయన ఇప్పటికీ తన రాజకీయ ఆరాధ్యుడిగానే భావిస్తుంటారు. అలాంటి శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రదర్శిస్తున్న దూకుడు, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న వైనం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులో కనిపించడం లేదు.

తాజాగా పరిస్థితుల్ని గమనిస్తే.. అదానీ అనే పారిశ్రామిక వేత్త పేరే అవినీతికి లంచాలకు పర్యాయపదంగా దేశమంతటా ప్రతిధ్వనిస్తున్నవేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇటీవల అదానీ గ్రూపు ప్రకటించిన వంద కోట్ల రూపాయల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఇలాంటి తెగువను ప్రదర్శించడం అనేది చంద్రబాబుకు ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు.

అదానీ సంస్థ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడమే సాధారణంగా జరుగుతూ ఉంటుంది. పెట్టుబడులకోసం రకరకాల ప్రాజెక్టులను ప్రతిపాదించడం, ప్రభుత్వం నుంచి రాయితీలను పొందడం, భూములను పొందడం వ్యాపారాలు మొదలుపెట్టడం సహజంగా జరిగే పని. ఏ వ్యాపారాల వెనుక లంచాలు పనిచేస్తాయో, ఏ వ్యాపారాలు నిజంగా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపకరిస్తాయో ఇదమిత్థంగా తేల్చిచెప్పడం కష్టం. లోగుట్టు బయటపడేదాకా అన్నీ గొప్ప ప్రాజెక్టులే అనుకోవాలి.

ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత తలపెట్టిన స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఏకంగా తమ ఫౌండేషన్ తరఫున వంద కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఇటీవల మన దేశంలో అయిదు రాష్ట్రాలు సెకితో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడానికి 2100 కోట్ల రూపాయల లంచాలు ముట్టజెప్పినట్టు అమెరికాలో కేసులు నమోదు కావడం పెద్ద సంచలనం.

ఆ తరువాత తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. అదానీ నుంచి విరాళం తప్ప.. ఆయన కంపెనీలకు ఒక్క గుంట భూమి కూడా తమ ప్రభుత్వం ఇవ్వలేదని స్పష్టం చేశారు. అయితే తాజాగా.. తమ ప్రభుత్వానికి అదానీ మరక ఏ కొంచెమూ అంటకూడదనే ఉద్దేశంతో ఆ విరాళాన్ని కూడా తిరస్కరించారు రేవంత్ రెడ్డి.

అయితే ఇంత దూకుడుగా రాష్ట్రంమీద అదానీ ముద్ర లేకుండా చేయగల ధైర్యం చంద్రబాబుకు లేకుండాపోతోంది. ఒకవైపు జగన్ కుదుర్చుకున్న ఒప్పందాలు రాష్ట్రానికి భారం అంటూనే వాటిని రద్దు చేసుకోవడానికి ఆయన సాహసించడం లేదు. ఇంకా.. అదానీ సంస్థతో పెట్టించే పెట్టుబడులను ఘనంగా చాటుకుంటున్నారు. అదానీ అంటేనే అవినీతికి పర్యాయపదంగా మారిన వైనం చంద్రబాబు గుర్తించలేకపోతున్నట్టుగా ఉంది.

20 Replies to “రేవంత్ ధైర్యం.. చంద్రబాబుకు లేదు!”

  1. ఒకవేళ రిజెక్ట్ చేస్తే తమరు రాసే రాతలు ఇలా ఉంటాయి. ఎందుకు అహంకారం? అవ్వ పెట్టదు అడుక్కొనివ్వదు అంటూ చెత్త రాతలు రాస్తావు

  2. Konchem aina siggundali ra GA. Avineethi chesi state ni nashanam chesindi kakunda ippudu vachina pettubadulu venakki icheyyali antava…assalu ye moham pettukuni ilanti thoughts vasthay ra munda

  3. బాబూ మేధావి, ఇప్పుడు ఇండియా అదానీ ని కాదనేస్థితి లో లేదు. అతను అడుగు పెట్టని రంగం లేదు,ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పట్టుకొమ్మలయిన పోర్ట్స్, సిమెంట్, రెన్యూబుల్ ఎనర్జీ, షిప్పింగ్, లాజిస్టిక్స్, పవర్, స్టీల్, మైన్స్, కోల్ ఇలా అన్నీ వున్నాయి. బాబు అదానీ తప్ప అందరితో MOU లు చేసుకున్నాడు. జగన్ అనే ల0చగొ0డి చేసిన డిమాండ్ వల్లనే రాష్ట్రానికి ఇప్పుడు చెడ్డ పేరు వచ్చింది. అదానీ పవర్ ద్వారా జరిగిన తప్పుని , మిగతా కార్పొరేషన్స్ మీద పడకుండా చిక్కు ముడిని విడదీసి , ఆ కాంట్రాక్టు రద్దు చెయ్యాలి. రాష్ట్రానికి పట్టుకొమ్మలయిన పోర్ట్స్ ని మనం డిలే చేయలేము. అలానే జగన్ ని బొ/ క్కలో వేసి ఆ డబ్బు వసూలు చెయ్యాలి. కమ్యూనిస్ట్ కేరళ నే వింజరం పోర్ట్ పనులని ఆపకుండా ముందుకు వెళ్తుంది, నీకు బాబు అర్జెంటు గ అదానీ కాంట్రాక్ట్స్ బాన్ చెయ్యాలని వుందా, అసలు రాష్ట్రము మీద కాస్త అయినా ప్రేమ వుందా?

  4. అక్కడ ప్రతిపక్షాలకి అడిగే ధైర్యం, అసెంబ్లీ కి వెళ్లే ధైర్యం ఇక్కడి ఆలీ బాబా 11 దొంగలకి ఉందా? అది కూడా రాయి ఎంకటి..

  5. ఒరేయ్ గూట్లే…అక్కడ విరాళం మాత్రమె ఇచ్చాడు…సో వెనక్కి ఇచ్చారు. ఇక్కడ దరిద్రుడు గంగవరం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్ ధారాదత్తం చేసాడు. కరెంటు ఎక్కువ ధరకు కొన్నాడు

  6. జగన్ రెడ్డి కూడా ధైర్యం గా.. లంచం గా తీసుకున్న 1750 కోట్లు వెనక్కి ఇచ్చేయొచ్చు కదా..

    జగన్ రెడ్డి ధైర్యం గురించి ప్రశ్నించే ధైర్యం నీకు లేదా..? న్యూట్రల్ జర్నలిస్టుల గారు..

  7. రేవంత్ కి ప్రతిపక్షాన్ని ఉ పోపించే ధైర్యం ఉంది..ఇక్కడ ఉందా అని రాయి..

  8. అసలు మన సింహం దీని గురించి ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు?

    భయమా, భక్తా… సిగ్గా… భయం వల్ల సిగ్గుతో వచ్చిన భక్తా…

    ఆధానీ లాంటి వాళ్ళ మీద తొందరపడి ఎవరూ నిర్ణయం తీసుకోరు..

    ఇప్పుడు తెలంగాణ కి పెట్టుబడులు రాకున్నా పరవాలేదు… హైదరాబాద్ ని 10గే సారు. ఎన్ని సొల్లు కబుర్లు అయినా చెపుతారు

    కానీ ఆంధ్రా కి అలాగ కాదు ఆధానీ లాంటి పెట్టుబడి దారులు అవసరం… వాళ్ళని కాదు అని ఇస్తే మళ్ళీ జాకో గాళ్ళు కులం టాగ్ బయటకు తీస్తారు…

    ఇవన్నీ నీకు తెలియక కాదు… నిస్వార్థం గా వార్తలు రాస్తావు కాబట్టి కడుపు నొప్పి

  9. ఆదానీ ఫక్తు వ్యాపారవేత్త అయన కు లంచగొండు నేతలను ఎలాగా వాడుకోవాలో తెలుసు వాళ్లకు రోత పడేస్తే కాళ్ళకాడ కుక్కల లాగా కూర్చొని రాష్ట్రాన్నే అమ్మేసే నాయకులూ అయన పడేసే ఎంగిలికోసం ఎదురుచూస్తుంటారని ఆయనకు తెలుసు అటువంటి నాయకులను ఎలాగ డీల్ చేయాలో ఆయనకు తెలుసు అదే cbn లాంటి నాయకుడు ని ఎలాగా ఉపయోగించుకోవాలో కూడా తెలుసు బాబు గారు ఒక ప్రాంతాన్ని అభివృద్ధి పరచి జనాలకు ఉపాధి వచ్చేలాగా చేసి అయన ఆ ప్రాంత అభివృద్ధి ద్వారా లబ్ది పొందుతాడు ఇది రాష్ట్ర ఆదాయం పెంచుతుంది జనాలకు ఉపాధి పెంచుతుంది ఆయనకు లబ్ది చేకూరుతుంది ఇది విన్ విన్ మోడల్ అండ్ సక్సెస్ఫుల్ ఫార్ములా

    1. అబ్బ అబ్బ ఏమి సెప్తిరి ఏం సెప్తిరి.. మనం చెస్తే సంసారం అని దానికి కొత్త నిర్వచనం చెప్పారు.. 1990 నుండి మన రాష్ట్ర జీడీపీ .. అప్పులు .. పెట్టుబడులు.. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ .. ఇలా ఏది చేసిన దెంగెసింది బాబు అని అందరికీ తెలుసు.. మన వలకి దోచపెట్టడం మరియు మీడియా లో పొగిడిచుకోవడం అందరికీ వెన్ను పోటు పొడవడం దొరకకుండా దొంగతనం చేయడం వెన తో పెట్టిన విద్య మన దొంగ బాబు మరియు ముఠా కి ..

Comments are closed.