అనుమానాలు కలిగేలా నారాయణ మాటలు!

టెండర్లు రద్దు చేయడం అంటే ఓకే గానీ.. డిజైన్లను జగన్ రద్దు చేయడం అంటే ఏమిటో అర్థం కాని సంగతి.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం అమరావతి రాజధానిలో సెక్రటేరియేట్, హైకోర్టు భవనాలు, అసెంబ్లీలను ఐకానిక్ భవనాలుగా నిర్మించాలని గతంలో సంకల్పించింది. వీటిలో సెక్రటేరియేట్, హైకోర్టు భవనాలకు చంద్రబాబు ప్రభుత్వ కాలంలోనే పునాదులు కూడా పడ్డాయి. ఆ మేరకు పనులు మొదలయ్యాయి.

జగన్ సీఎం అయిన తర్వాత అమరావతి పనులు మొత్తంగా స్తంభించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మంత్రి నారాయణ ఈ ఐకానిక్ భవనాల నిర్మాణానికి డిజైన్లకోసం మళ్లీ టెండర్లు పిలిచామని, ఇదివరకు చేసిన నార్మన్ అండ్ పోస్టర్స్ సంస్థే మళ్లీ దక్కించుకున్నదని అంటున్నారు. ఆల్రెడీ పునాదులు కూడా పడిన నిర్మాణాలకు మళ్లీ డిజైన్ల పేరిట టెండర్లు పిలవడం ఏమిటా? అని ప్రజలకు సందేహాలు కలుగుతున్నాయి.

చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేతపట్టిన తర్వాత.. అమరావతి పనులను శరవేగంగా చేపడుతున్నారు. అమరావతి ప్రాంతమంతా జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. ఐకానిక్ భవనాలను గతంలో నిర్మించి తర్వాత వదిలేసిన పునాదుల మీదనే కొనసాగించి నిర్మించవచ్చునా లేదా? అనే విషయంలో చెన్నై ఐఐటీ నిపుణుల్ని పిలిపించి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. అంతా అయిన తర్వాత.. అవే పునాదుల మీద నిర్మాణాలు పూర్తిచేయబోతున్నట్టుగా ప్రకటించారు.

సెక్రటేరియేట్, హైకోర్టులను పాత డిజైన్ల ప్రకారమే పూర్తిచేస్తాం అని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు మంత్రి నారాయణ అవే ఐకానిక్ భవనాల డిజైన్లకోసం మళ్లీ టెండర్లు పిలిచాం అని అంటున్నారు. గతంలో జగన్ సర్కారు నార్మన్ పోస్టర్స్ వారి టెండర్లను, డిజైన్లను రద్దు చేసిందని, అందువల్ల మళ్లీ టెండర్లు పిలిచాం అని జగన్ మీదకు నెడుతున్నారు.

టెండర్లు రద్దు చేయడం అంటే ఓకే గానీ.. డిజైన్లను జగన్ రద్దు చేయడం అంటే ఏమిటో అర్థం కాని సంగతి. ఆల్రెడీ మొదలైన పనులకు మళ్లీ డిజైన్లకోసం టెండర్లు పిలవడం అనేది ఏదో ప్రహసనప్రాయంగా లోపాయికారీగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.

21 Replies to “అనుమానాలు కలిగేలా నారాయణ మాటలు!”

  1. kodi b u r r a k u k k a …..cost index prakaaaram malli estimation vestaaru……..s a n n a s i l a n j a k o d u k u la g a e d o r a a y a l a n i ch o o s t a a v…no t l o v uc h a po i n c h u k u nt a a a v……..

    1. ఆ విషయం GA గాడికి కూడా తెలుసు.. కాకపోతే.. ఎలా ఒక ఆర్టికల్ వదిలాడు అనుకో.. ఒక లేకి బ్యాచ్ రెడీ గ ఉంటది.. అది నిజమేనేమో అని నమ్మేసి కామెంట్స్ పెట్టేస్తది… వాళ కోసం ఇలాంటి ఆర్టికల్స్. అదొక తుత్తి

  2. ఆ విషయం GA గాడికి కూడా తెలుసు.. కాకపోతే.. ఎలా ఒక ఆర్టికల్ వదిలాడు అనుకో.. ఒక లేకి బ్యాచ్ రెడీ గ ఉంటది.. అది నిజమేనేమో అని నమ్మేసి కామెంట్స్ పెట్టేస్తది… వాళ కోసం ఇలాంటి ఆర్టికల్స్. అదొక తుత్తి

  3. do you know anything about design for construction? I am a civil engineer…Only preliminary designs are prepared prior to construction and Construction reference drawings & Good for construction drawings need to be prepared for each element of structure as per construction sequence and designers assistance is required throughout the construction… Previous consultants are brought in again as they are the one who prepared conceptual design…

  4. నేనొచ్చా మొదలెట్టు …ప్రతిసారి మళ్ళీ పెళ్లి…మళ్ళీ పెళ్లి

    అది పెళ్లి అవదు ….పెటాకులు అవదు…అసలు ఏమి అవదు.

  5. You people don’t know full matter.

    That means,for balance works to be continued with the same design,but supervision and quality assurance to be wittenesed.No one will work for the fees and contracts approved 7 years back,since market prices were hiked.

    Same exactly the Reverse tender to fix current price for balance works.

Comments are closed.