సినిమా హీరోల‌పై వెర్రి అభిమానం.. ప్రాణాలు, పిల్ల‌ల వ‌ర‌కూనా!

ఏ విష‌యంలో అయినా అతి కూడ‌దంటారు. అయితే సినిమా అభిమానం విష‌యంలో అతి ప‌రాకాష్ట‌కు చేరిపోయింది.

సినిమా హీరోల‌పై వెర్రి అభిమానం ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ఉన్న జాడ్యాల్లో ఒక‌టి. మన కన్నా బెస్ట్ సినిమాల‌ను తీసే ఇండ‌స్ట్రీలున్నాయి. మ‌నం తీసే సినిమాల‌కు తాత‌ల్లాంటి సినిమాల‌ను ద‌శాబ్దాల కింద‌టే తీసిన ఇండ‌స్ట్రీలున్నాయి. అయితే ఆయా దేశాల్లో సినిమా న‌టులు కూడా మ‌నుషులే! బ‌న‌బోటి మ‌నుషులే. వారు ప్ర‌తిభావంత‌మైన న‌టులంతే! వారికి ఆ మేర‌కు రెమ్యూనిరేష‌న్లు, అవార్డులు, రివార్డులు ద‌క్కుతాయి. వారి ప‌నివారు చేసుకుంటూ ఉంటారు, ఆస‌క్తి ఉన్న వాళ్లు వాళ్ల పోస్ట‌ర్ల‌ను ఇంట్లో వేలాడ‌దీసుకుంటారు. ఇక్క‌డి వ‌ర‌కూ ఓకే!

అయితే.. హీరోల క‌టౌట్ల‌కు జంతుబ‌లులు ఇచ్చేంత మూర్ఖ‌త్వం ఉన్న‌ది మాత్రం ఇండియాలోనే, ఏ ఆఫ్రికా దేశాల్లో కూడా ఇలాంటి క‌ట్టుబాట్లు ఉండ‌వు! ఇండియాకు, అందునా సౌత్ ఇండియాకు, ఇంకా చెప్పాలంటే తెలుగునాటే ఇలాంటివి జ‌రుగుతూ ఉంటాయి. మ‌రి వెర్రిత‌ల‌లు వేసిన అభిమానం స‌ద‌రు సినిమా హీరోల‌కు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు త‌లనొప్పి తెప్పిస్తూ ఉంటుంది. అందుకే వారు కూడా ఈ అభిమానుల‌ను త‌మ వ‌ర‌కూ వ‌స్తే క‌సురుకుంటారు, తిడ‌తారు, కొడ‌తారు, త‌రుముతారు కూడా! ఆ హీరోల‌కే విసుగు పుట్టించేలా ఉంటాయి ఈ అభిమానుల చేష్ట‌లు! అదేమంటే.. అభిమానంతో ద‌గ్గ‌రికెళితే కొడ‌తార‌ని మీడియా విశ్లేషిస్తుంది.

కానీ అభిమానుల చేష్ట‌లు వికృత‌రూపంలోనే ఉన్నాయ‌ని నిస్సందేహంగా నిజం. తెలుగునాట సినిమా అభిమానానికి కులం కూడా తోడ‌వ్వ‌డం ఇంకో ప్ర‌త్యేక‌త అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సినిమా, అభిమానం, కులం ఇలా క‌ల‌గ‌లిసిపోయి.. ఇక్క‌డ త‌మ ప్రాణాల మీద‌కు తెచ్చుకునే వ‌ర‌కూ వెళ్తోంది వ్య‌వ‌హారం!

జాగ్ర‌త్త‌లు మ‌రిచిపోయారు. పిల్ల‌ల‌ను కూడా అలాంటి క్రౌడ్ ల‌లోకి ఎలా తీసుకెళ్తున్నారు? ఏం సాధించేందుకు తీసుకెళ్తున్నారు? అర్ధ‌రాత్రి, అప‌రాత్రి వేళ థియేటర్ల వ‌ద్ద‌కు ప‌సిపిల్ల‌ల‌ను తీసుకెళ్లి.. వారిని ఏర‌క‌మైన భావిపౌరులుగా చేద్దామ‌ని త‌ల్లిదండ్రులు భావిస్తున్నారో కూడా అంతుబ‌ట్ట‌ని ప‌రిస్థితి. అస‌లు ఈ సినిమాను 18 యేళ్ల వ‌య‌సు లోపు వారు చూడ‌ట‌మే నేర‌మ‌న్న‌ట్టుగా సెన్సార్ స‌ర్టిఫికెట్లు ఉంటున్నాయి. అలాంటిది విప‌రీతంగా ర‌ద్దీ ఉండే చోట‌కు చిన్న పిల్ల‌ల‌ను తీసుకెళ్ల‌డం ఎంత పెద్ద నేరం? అంత క్రౌడ్ లోకి పిల్ల‌ల‌ను తీసుకెళ్లి ఏ సాధిద్దామ‌నుకుంటార‌నేదే అస‌లు స‌మాధానం చిక్క‌ని ప్ర‌శ్న‌.

పిల్ల‌ల‌కు సినిమా ఇష్టం అయితే టికెట్ బుక్ చేసుకుని వెళ్లాలి కానీ, తొక్కిస‌లాట జరిగే ఛాన్సులు ఉన్నాయ‌నే ఇంగిత‌మైనా ఉండాలి క‌దా! జ‌రిగిన విషాద‌ఘ‌ట‌న గురించే కాదు, పసి పిల్ల‌ల‌తో సినిమా డైలాగులు వ‌ల్లె వేయించి, వారిని భావిత‌ర‌పు సినీతీవ్ర‌వాదులుగా త‌యారు చేస్తున్న త‌ల్లిదండ్రులు కూడా కోకొల్ల‌లు!

పసి వ‌య‌సులో వారి చేత బూతు పాట‌ల‌కు డ్యాన్సులు చేయిస్తూ.. కుర్చీమ‌డ‌త బెట్టి అంటూ రీల్స్ చేయిస్తూ కొంద‌రు త‌ల్లిదండ్రులు ముచ్చ‌ట ప‌డిపోతూ ఉంటారు. వాటిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేసి.. లైక్స్ ను లెక్కేసుకుంటూ ఉన్నారు! దెబ్బ‌లు ప‌డ‌తాయిరో.. అంటూ ఏడెనిమిదేళ్ల ప‌సి వాళ్ల‌తో వేషాలు వేయిస్తూ.. త‌మ ఉత్త‌మ అభిరుచిని చాటుకుంటూ ఉన్నారు విజ్ఞులైన తెలుగు సినివీరాభిమానులు. యూట్యూబుల్లో, ఇన్ స్టాలో ఇలాంటి వారిని త‌ట్టుకోవ‌డం కూడా క‌ష్ట అయిపోయింది.

తాము అభిమానించ‌డం, తాము డ్యాన్సులు వేసుకోవ‌డం, తాము జ‌నాల మ‌ధ్య‌న దూరి నలిగిపోవ‌డం ఆ వీరాభిమానుల ఇష్టం. అయితే పిల్ల‌ల‌ను కూడా త‌మ దారిన తీసుకెళ్ల‌డం మాత్రం క్ష‌మించ‌రాని నేరం! ఈ విష‌యంలో ప్ర‌భుత్వాల‌నో, పోలీసుల‌నో, ఆఖ‌రికి ఆ సినిమా హీరోను అనాల్సిన అవ‌సరం కూడా లేదు! ఆ సినిమా హీరోది వ్యాపారం. హీరోల ప‌ని హీరోల‌ది. ప్ర‌భుత్వాలు, పోలీసులు ఎంత‌క‌ని కాపాలా కాస్తారు! ఒక‌వేళ ఇలాంటి షోల‌కు ప‌ర్మిషన్లు ఇవ్వ‌క‌పోతే.. ప్ర‌భుత్వాల‌పై సోష‌ల్ మీడియాలో వీరాభిమానుల వికృత‌దాడులు! త‌మ హీరో సినిమాల‌కు ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌రా అంటూ వీరి గ‌గ్గోలు పెడ‌తారు! ఇలాంటివి జరిగిన‌ప్పుడు పోలీసులు, ప్ర‌భుత్వాలు గుర్తుకువ‌స్తాయి మ‌ళ్లీ!

ఏ విష‌యంలో అయినా అతి కూడ‌దంటారు. అయితే సినిమా అభిమానం విష‌యంలో అతి ప‌రాకాష్ట‌కు చేరిపోయింది. అది క్ర‌మ‌క్ర‌మంగా మ‌రింత ముదిరిపోతోంది తెలుగు రాష్ట్రాల్లో. సినిమా టికెట్ రేట్ల‌ను ప్ర‌భుత్వం త‌గ్గించినా స‌హించ‌లేనంత ప‌రిస్థితుల్లో ఉన్నారు అభిమానులు! ఈ మూకస్వామ్యం ముదిరి.. విషాద‌ఘ‌ట‌న‌ల‌కు తావిస్తూ ఉంది. అయితే .. వీటిని లెక్క చేసే ప‌రిస్థితుల్లో సినీ వీరాభిమానులు లేరు! ఇవ‌న్నీ వారికి ఒక లెక్క కాదు! ఎందుకంటే వారు అభిమానులు!

14 Replies to “సినిమా హీరోల‌పై వెర్రి అభిమానం.. ప్రాణాలు, పిల్ల‌ల వ‌ర‌కూనా!”

  1. హీరోలని తిడితే ఇక్కడ కూడా బండబూ తులు మెసేజ్లు పెడుతున్నారు వాళ్ళ ఫ్యాన్స్ ఏదో వాళ్ళ ఫ్యామిలీ నీ అంటున్నట్టు. అది కూడా ఉన్మాదమే కదా.

    1. Ippudu rajakeeya unmadam vachindi bro

      Cinema fans ki accident ayithene ilantivi jarugutayi

      Polical fans valla nayakudu champesina tappu kadane daridram AP lo vundi

      Vari kosam …..

      2019 lo

      2024 lo election taruvata attacks

      Murders yenni jarigayi

      Avanni abhimanam kosame kada

      Rastram kosam valla kosama….

  2. అంటే పవన్ కల్యాణ్ కి బన్నీ thanks చెప్పాడు కాబట్టి రాసావ్…లేకపోతే….పిచ్చి GA తప్పు ఎవరు చేసిన తప్పే GA….. జనం అన్ని గమనిస్తూనే వుంటారు…

  3. అమ్మ బాబోయ్ ఇంత జ్ఞానం ఉన్న మీకు సినిమా అట్రాక్షన్ కోసం జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ ఫ్యాన్ ని దువ్వడం కోసం కిందా మీద పడడం ఎందుకు???? అలీ పోసాని శ్యామల రోజా శ్రీ రెడ్డి లాంటోళ్ళు ని ఎంకరేజ్ చేయడం దేనికి??? Rgv తో వ్యూహం, vere డైరెక్టర్ తో అన్న బయోపిక్ తీయించుడం ఎందుకు???

  4. నువ్వు చెప్పిన దాంట్లో కొంత నిజం వున్నా నీతులు చెప్పే ప్లేస్ లో మాత్రం కచ్చితంగా గ్రేట్ ఆంధ్ర లేదు

  5. అభిమానం కాదు.. అది ఉన్మాదం… వాళ్ళ హీరో ని దేవుడు ని చేసి… వీళ్ళు పూనకం వచ్చినట్టు గా ఊగిపోతుంటారు.. పైగా ఆలా చేయడం గొప్పగా ఫీల్ అవుతుంటారు

Comments are closed.