జ‌త్వానీ కేసులో విద్యాసాగ‌ర్‌కు బెయిల్‌

ముంబ‌య్ న‌టి జ‌త్వానీ కేసులో ఉమ్మ‌డి కృష్ణా జిల్లాకు చెందిన కుక్క‌ల విద్యాసాగ‌ర్‌కు ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్ ల‌భించింది.

ముంబ‌య్ న‌టి జ‌త్వానీ కేసులో ఉమ్మ‌డి కృష్ణా జిల్లాకు చెందిన కుక్క‌ల విద్యాసాగ‌ర్‌కు ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్ ల‌భించింది. ఈ మేర‌కు ఏపీ హైకోర్టు ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు 76 రోజులుగా జైల్లో ఉన్నారు. ప‌లు ద‌ఫాలు ఆయ‌న బెయిల్ కోసం ప్ర‌య‌త్నించారు. కానీ కోర్టు తిర‌స్క‌రిస్తూ వ‌చ్చింది. పోలీసుల విచార‌ణ‌ను ఆయ‌న ఎదుర్కొన్నారు.

ఇదే కేసులో ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీని ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన సంగ‌తి తెలిసిందే. వీళ్ల‌ను కూడా అరెస్ట్ చేయాల‌నేది ప్ర‌భుత్వం ప‌ట్టుద‌ల‌తో వుంది. అయితే ఏపీ హైకోర్టు వాళ్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని ఆదేశాలు ఇవ్వ‌డంతో పోలీసులు అరెస్ట్ చేయ‌లేక‌పోతున్నారు. అ నేప‌థ్యంలో ప్ర‌ధాన నిందితుడైన విద్యాసాగ‌ర్‌కు బెయిల్ ఇవ్వొద్ద‌ని, సాక్ష్యుల‌ను ప్ర‌భావితం చేస్తార‌ని ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాదులు వాదించారు.

అలాగే నిందితుడు విద్యాసాగ‌ర్ త‌ర‌పున త‌మ క్ల‌యింట్ ఇప్ప‌టికే రెండు నెల‌ల‌కు పైగా జైల్లో ఉన్నార‌ని, ప‌లు ద‌ఫాలు విచార‌ణ ఎదుర్కొన్నార‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న ఏపీ హైకోర్టు ఇవాళ కీల‌క తీర్పు వెలువ‌రించింది. నిందితుడి త‌ర‌పు న్యాయ‌వాది వాద‌న‌ల‌తో కోర్టు ఏకీభ‌వించింది. దీంతో ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేసింది.

ప్ర‌ధాన నిందితుడికి బెయిల్ మంజూరు కావ‌డంతో ఇంకా ఈ కేసులో మ‌లుపులు వుంటాయా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

3 Replies to “జ‌త్వానీ కేసులో విద్యాసాగ‌ర్‌కు బెయిల్‌”

Comments are closed.