సెక్రటేరియట్ లో విగ్రహం సరే.. మిగతా ప్రాంతాల్లో ఏం చేస్తాడు?

రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో, నగరాల్లో ఉన్న కేసీఆర్ హయాంనాటి విగ్రహాల సంగతి ఏమిటి?

రేవంత్ రెడ్డి మార్కు తెలంగాణా తల్లి విగ్రహాన్ని ఈరోజు సెక్రటేరియట్ లో ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ విగ్రహం కేసీఆర్ మీద కోపంతో, పంతంతో రేవంత్ రెడ్డి రూపొందించాడు. ఒకవేళ గులాబీ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ పెట్టిన విగ్రహాన్ని తొలగిస్తారో ఏమో చెప్పలేం. ఆల్రెడీ కేటీఆర్ ఈ మాట చెప్పాడు కూడా.

నిజానికి కేసీఆర్ హయాంలో రూపొందించిన తెలంగాణా తల్లి బాగానే ఉంది. రేవంత్ సీఎం కాగానే కేసీఆర్ జ్ఞాపకాలు, ఆయన ఆనవాళ్లు చెరిపేయాలనుకున్నాడు. ఆయన చూపు తెలంగాణ తల్లిపైనా, ప్రభుత్వ అధికారిక చిహ్నం పైనా, తెలంగాణ గీతం పైన పడింది. వాటిల్లో రాచరిక లక్షణాలు ఉన్నాయని, ఆ పోకడలు ఉన్నాయని అన్నాడు.

తెలంగాణ తల్లి అంటే తెలంగాణలోని సామాన్య మహిళలా ఉండాలని అన్నాడు. ఆ విధంగానే విగ్రహం తయారుచేయించాడు. కానీ ఈ విగ్రహం చూడగానే భక్తిభావం కలగదనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తామని చెప్పగానే గులాబీ పార్టీ వ్యతిరేకించడం, విమర్శలు చేయడం మొదలుపెట్టింది. రేవంత్ రెడ్డికి కేసీఆర్ పైన తీవ్ర వ్యతిరేకత ఉండొచ్చు.

వ్యక్తిగతమైన పగ, కక్ష ఉండొచ్చు. కానీ ఆయన జ్ఞాపకాలను లేకుండా చేస్తానని చెప్పడం, అలా చేయడం మంచిది కాదు. నిజానికి తెలంగాణ తల్లి అంటే రాష్ట్రాన్ని రెప్రజెంట్ చేసే ఒక సింబల్ మాత్రమే. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుతల్లి విగ్రహం మాత్రం సామాన్య తెలుగు మహిళలా ఉందా? కేవలం అదొక గుర్తు మాత్రమే.

ఓకే…రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం వద్ద పెట్టాడు. బాగానే ఉంది. కానీ రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో, నగరాల్లో ఉన్న కేసీఆర్ హయాంనాటి విగ్రహాల సంగతి ఏమిటి? ప్రతి విగ్రహం స్థానంలో రేవంత్ మార్కు విగ్రహాలను పెడతారా? అలా పెట్టకపోతే రెండు విధాలైన తెలంగాణ తల్లి విగ్రహాలు ఉంటాయి కదా.

6 Replies to “సెక్రటేరియట్ లో విగ్రహం సరే.. మిగతా ప్రాంతాల్లో ఏం చేస్తాడు?”

  1. కెసిఆర్ తెలంగాణ తల్లి లో గుడుంబా కవిత పోలికలు వున్నాయి అనే కదా అసలు మార్పు చేసింది. కొత్త రూపురేఖలు బాగానే వున్నాయి. ఇంకా జిల్లాల్లో మార్పు అనేది కాకతాళీయం.

Comments are closed.