ప్చ్‌.. ఏ శాఖ‌లోనూ నిధుల్లేవ్‌!

ఏపీ ఆర్థిక ప‌రిస్థితి తెలిసి కూడా చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ అలివికాని హామీలిచ్చార‌నే విమ‌ర్శ వుంది.

ఎన్నిక‌ల్లో కూట‌మి హామీలు చూస్తే, ఆకాశ‌మే హ‌ద్దు. ప్ర‌భుత్వ ఖ‌జానా చూస్తే పైసా కూడా లేదు. దీంతో సూప‌ర్ సిక్స్ హామీలు అమ‌లు చేయాలంటే భ‌య‌మేస్తోంద‌ని అసెంబ్లీ వేదిక‌గా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆవేద‌న చెంద‌డం చూశాం. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి తెలిసి కూడా చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ అలివికాని హామీలిచ్చార‌నే విమ‌ర్శ వుంది. ఏది ఏమైతేనేం కూట‌మి నేత‌లు కోరుకున్న‌ట్టుగానే అధికారాన్ని ద‌క్కించుకున్నారు.

అధికారంలోకి వ‌చ్చి ఏడు నెల‌లు స‌మీపిస్తోంది. ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేద‌నే వ్య‌తిరేక భావ‌న రానివ్వ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు అనుకుంటున్నారు. అయితే జ‌నానికి అస‌లేం జ‌రుగుతున్న‌దో ఎప్ప‌టిక‌ప్పుడు తెలుస్తూనే వుంది. ఈ నేప‌థ్యంలో వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ కీల‌క కామెంట్స్ చేశారు.

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా క‌లెక్ట‌రేట్‌లో నిర్వ‌హించిన జిల్లా స‌మీక్ష స‌మావేశానికి ఇన్‌చార్జ్ మంత్రిగా అచ్చెన్నాయుడు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖ‌ల‌పై స‌మీక్షించామ‌న్నారు. అయితే ఏ శాఖ‌లోనూ నిధులు లేవ‌ని ఆవేద‌న చెందారు. నిధులు తెచ్చుకునేందుకు త‌గిన కార్యాచ‌ర‌ణ ర‌చిస్తామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. రానున్న రెండేళ్ల‌లో గిరిజన గ్రామాల‌కు రోడ్లు వేస్తామ‌న్నారు.

ప్ర‌భుత్వ పెద్ద‌లు ప్ర‌తి సంద‌ర్భంలోనూ నిధులు లేవ‌నే స‌మాచారాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి సానుభూతి పొందే ప్ర‌యత్నం చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తోంది. ఇదంతా ప్ర‌జ‌ల్ని మోస‌గించే కుట్ర‌లో భాగ‌మే అని వారు అంటున్నారు.

3 Replies to “ప్చ్‌.. ఏ శాఖ‌లోనూ నిధుల్లేవ్‌!”

  1. 13 లక్షల కోట్లప్పు ఉంది అని ఎన్నికలలో అన్నప్పుడే సూపర్ సిక్స్ అన్నారు కదరా… ఇప్పుడు సాక్షాత్తు అసెంబ్లీ లోనే.. అప్పు కేవలం 6.48 లక్షలకోట్లే అని ఒప్పుకున్నారు గా? అంటే మీరు అనుకున్న దాని కంటే. సగమే గా? ఇవ్వటానికేం? ఈ సోళ్లంతా ఎందుకు? బటన్ నొక్కటం ఎంత కష్టమో ఇప్పుడర్ధం అయ్యిందా? వాడు మగాడు మొనగాడు ర.. మీ లా M@ D@ కాదురా!

Comments are closed.