అఖండ సినిమా తర్వాత దానికి సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని బాలకృష్ణ అభిమానులు ఎదురుచూశారు. మధ్యలో ఇటు బాలకృష్ణ, అటు బోయపాటి చెరో సినిమాతో బిజీ అవ్వడంతో సీక్వెల్ లేట్ అయింది.
ఆ మధ్య అఖండ-2ను పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. ఓపెనింగ్ రోజే బాలకృష్ణతో గంభీరంగా డైలాగ్ కూడా చెప్పించాడు బోయపాటి.
ఆ తర్వాత మళ్లీ సినిమాపై ఎలాంటి అప్ డేట్ లేదు. మళ్లీ ఇన్ని రోజులకు ఈ సినిమా తెరపైకొచ్చింది. అఖండ-2 రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్ లో ఫైట్ సీక్వెన్స్ తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు.
బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా ఇది. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. మరీ ముఖ్యంగా అఖండ సినిమా అన్నింటికంటే పెద్ద హిట్టు. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ రాసుకున్నాడు బోయపాటి.
సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా మరోసారి ప్రగ్యా జైశ్వాల్ ను తీసుకున్నారు. మ్యూజిక్ డైరక్టర్ గా ఎప్పట్లానే తమన్ కు అవకాశం దక్కింది. వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు
You want enjoy 9010471199