కావాలని కొట్టలేదు.. వేడి మీద కొట్టారంట

మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు చేయి చేసుకున్న ఘటనను ఆయన కొడుకు మంచు విష్ణు సమర్థించుకున్నాడు.

మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు చేయి చేసుకున్న ఘటనను ఆయన కొడుకు మంచు విష్ణు సమర్థించుకున్నాడు. తన తండ్రి మీడియాపై కావాలని చేయి చేసుకోలేదని, ఆ వేడిలో అలా జరిగిపోయిందని అన్నాడు.

“ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆ వేడిలో అలా జరిగిపోయింది. కావాలని కొట్టలేదు. మీడియా అంతా మరోసారి ఆ వీడియో చూడండి. ఆయన నమస్కరిస్తూ చేతులు జోడించి మీడియా ముందుకొస్తున్నారు. మీడియాతో మాట్లాడ్డానికి నాన్నగారు వస్తున్నారు. అంతలోనే లోపలికి ధడేల్ మంటూ అంతా దూసుకొచ్చారు.”

తన తండ్రి భయపడే రకం కాదని, దేనికైనా ఎదురెళ్తారని, అందుకే ఆ ఉద్రిక్త పరిస్థితుల్లో అలా చేయి చేసుకోవాల్సి వచ్చిందంటున్నాడు మంచు విష్ణు. మనసు గాయపడి ఓ తండ్రిగా ఆయన రియాక్ట్ అయ్యాడే తప్ప, మీడియాపై కోపం కాదంటున్నాడు.

ఘటనకు సంబంధించి తండ్రి తరఫున మీడియాకు సారీ చెప్పిన విష్ణు, బాధిత జర్నలిస్ట్ కుటుంబంతో టచ్ లోనే ఉన్నామని, అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించాడు.

ఈ ఘటనకు సంబంధించి ఆల్రెడీ మోహన్ బాబుపై కేసు ఫైల్ అయింది. విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా చూడాలంటూ ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

అంతకంటే ముందు ఆయన ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్ లో జాయిన్ అయినప్పుడు హై బీపీతో బాధపడుతున్నట్టు తెలిపిన వైద్యులు.. ఎడమ కన్ను కింద వాచిందని, అంతర్గతంగా గాయాలున్నాయని వెల్లడించారు.

32 Replies to “కావాలని కొట్టలేదు.. వేడి మీద కొట్టారంట”

  1. TV9 ని కొట్టడం తప్పులేదు అనేది నా భవన మీకు తప్పు అనిపిస్తున్నాda ఐతే మీడియా విలువలు సింతకాya అన్ని సరిచుకొni కామెంట్ చేయండి ..

  2. సింగల్ సింహం వియ్యంకుడు అక్కడ.. Hospital లో దాక్కునే ఖర్మ ఎం పట్టింది?? తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ ప్రకారం ఏదో డ్రామా జరుగుతోంది అంతే..

    ఏందా గులకరాయి డ్రామా? ఎందుకీ కోడికత్తి డ్రామా??

    Wait and see

  3. మిమ్మల్ని చెప్పుతొ కొట్ట కుండా వదిలేశాడు అది పెద్ద తప్పు,మీ వల్ల కుటుంబాలు పాడు కావడం తప్ప,ఉపయోగం ఏం ఉంది, వేశ్యల కంటే దరిద్రపు బతుకులు మీవి

  4. Evadikaina personal life untundi danini media respect cheyali. Entha celebrities ainatha matrana valla jeeviatalu perfect ga em undav. Media mari personal life loki velli cheppalsina avasaram em ledu. there is should be some limit. ee vishayamlo mohanbabu tappu em kanapadatledu. chala mandi TV9 baga aindi anukuntunnaru but evadu bayataki cheppatledu anthe

  5. gates baddalkottukuni private property loki pothe criminal case ra rey. media is completely wrong here. vaadi permission lekunda vaadi premises loki ela enter avutarra meeru?

  6. Without permission how can media enter someone else home? Media is completely wrong. Even if you put a case on him nothing will happen to him. Western countries lo aithe reporter ni direct ga lopala veseyamantaru. inkonni countries lo aithe trespassing ki lepesina case avadu.

  7. Without permission how can media enter someone else home? Media is completely wrong. Even if you put a case on him nothing will happen to him. Western countries lo aithe reporter ni direct ga lopala veseyamantaru. inkonni countries lo aithe trespassing ki kalchesina case avadu.

  8. Without permission how can media enter someone else home? Even if you drag him to court nothing will happen to him. Western countries lo aithe reporter ni direct ga lopala veseyamantaru. inkonni countries lo aithe trespassing ki kalchesina case avadu.

  9. Without permission how can media enter someone else home? Even if you drag him to court nothing will happen to him. inkonni countries lo aithe trespassing ki kalchesina case avadu.

  10. Without permission how can media enter someone else home? Even if you drag him to court nothing will happen to him. Trespassing is criminal activity ra rey.

  11. భౌతికంగా దాడికి దిగడం కచ్చితంగా తప్పే, కానీ వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో వద్దు అన్నా మైక్ లు పట్టుకొని దూరిపోతు ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసం, తప్పు ఇరువర్గాల వైపు వుంది

      1. సార్, మీరు అనుకుంటున్నటు నేనేమి అగ్రవర్ణానికి చెందిన వాడ్ని కాదు ఎందుకు అనవసరంగా నోరు పారేసుకుంటారు

  12. ప్రతి రంగానికీ పరిమితి అంటూ ఉంటుంది,,మీడియా కూడా అతి చేస్తుంది,,,మోహన్ బాబు మరియు అతని కొడుకులు గొడవ వాళ్ళ వ్యక్తిగత0,,,వాళ్ల ఇంటికి వెళ్లి లోపలికి చోరబడి మైక్ లు పెట్టేసి,,చెప్పండి రా ? అని ఫోర్స్ చేస్తుంటే అజాత శత్రువుకి అయ్యినా కాలుతుంది,,ఇహ షార్ట్ టెంపర్ ఉన్నా మోహన్ బాబు కి మం డధా? అతను మంచి పని చేసాడు,,,ఇహ నైనా మీడియా సెలబ్రిటీ పర్సన్స్ పర్సనల్ లైఫ్ లోకీ వెళ్లి పోయి ఓవర్ యాక్షన్ చేయడం మానేయాలి,,

    1. budhi ledaa ..kula unmadham tho kallu dobbaayaa ? Aa vedhava ahamkaram tho swamy mala lo unna athanni champuthaada? aa vilekhari thappu emundi? media yajamanyam cheppindi manoj teeskelladu lopalaki.. neeku manavatwam undi ilaanti comments peduthunnnavaa? ee comment ki like lu pettinavallu kadupu ki asudham thintunnaraa..

Comments are closed.