మెగా స్టార్ కుటుంబం రికార్డు!

ఒకే కుటుంబం నుంచి ముగ్గురు మంత్రులుగా పనిచేయడం ఒక రికార్డే.

ఒక కుటుంబంలో అన్నదమ్ములు లేదా అక్కాచెల్లెళ్లు అందరూ డాక్టర్లు, ఇంజినీర్లు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు అవుతుంటారు. ఇలా ఫ్యామిలీ అంతా ఒకే బాటలో ఉంటారు. ఇది వింత కాకపోవొచ్చుగానీ జనం వీళ్ళ గురించి చెప్పుకుంటారు.

అలాగే ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి కుటుంబం గురించి కూడా చెప్పుకోవలసి వస్తోంది. ఆయన కుటుంబం నుంచి అనేకమంది హీరోలైన సంగతి తెలిసిందే. చిరంజీవి స్వశక్తితో పరిశ్రమలోకి వచ్చి తన ప్రతిభతో మెగా స్టార్ గా ఎదిగాడు. ఆయన బాటలోనే తమ్ముళ్లు పవన్ కళ్యాణ్ అండ్ నాగబాబు పయనించారు.

పవన్ కళ్యాణ్ కూడా హీరోగా ఎదిగి పవర్ స్టార్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్టు అయ్యాడు. టీవీ కార్యక్రమాలు చేశాడు. ముగ్గురు అన్నదమ్ములు సినిమా రంగంలోనే ఎదిగారు. ఆ తరువాత చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేశాడు.

తనకు విపరీతమైన ఇమేజ్ ఉంది కాబట్టి సొంతంగా పార్టీ పెట్టాడు. అన్నయ్య పార్టీ పెట్టగానే తమ్ముళ్లు కూడా అందులో క్రియాశీల పాత్ర పోషించారు. పార్టీ అధికారంలోకి వస్తుందని చిరంజీవి భావించినా అలా జరగకపోవడంతో దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో సహాయ మంత్రిగా చేరాడు.

తన రాజ్యసభ సభ్యత్వ గడువు ముగియగానే రాజకీయాలకు గుడ్బై చెప్పాడు. మెగా స్టార్ బాటలోనే పవర్ స్టార్ ప్రయాణించాడు. పవన్ సొంత పార్టీ పెట్టాడు. ఒక దారుణ వైఫల్యం తరువాత గత ఎన్నికల్లో ఆయన పార్టీ జనసేన అద్భుత విజయం సాధించింది. ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఆయన ఉపముఖ్యమంత్రి అయ్యాడు.

జనసేనలో కీలకపాత్ర పోషించిన ఆయన అన్నయ్య నాగబాబు త్వరలో మంత్రి కాబోతున్నాడు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు మంత్రులుగా పనిచేయడం ఒక రికార్డే. ఒకప్పుడు చిరంజీవి కేంద్రంలో మంత్రి అయితే ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండటం, ఆయన అన్నయ్య మంత్రి కాబోతుండటం విశేషమని చెప్పుకోవాలి.

17 Replies to “మెగా స్టార్ కుటుంబం రికార్డు!”

  1. One won the election & become minister with the support of alliance and the other two in short cut ways through RS & council. So just like in films, it’s their fake record in politics too.

  2. ఒకే ఇంట్లో తాత, కొడుకు మహామేత, A1 మనుముడు అందరూ ఫ్యాక్షన్ రాజకీయాలతో ముక్కులు, ముక్కలు కావడం కూడా రికార్డు అవుతుందేమో??

  3. ఎంత పిసికినా కట్టప్ప లాంటోడు నాగబాబు. ఎవరినీ వదిలి పెట్టడు

  4. పవన్ ఒక పబ్లిక్ మీటింగ్ లో ,నేను కుటుంబ రాజకీయాలు చేయడానికి రాలేదు , అన్నాడు . ఇప్పుడు అన్నకే మంత్రి పదవి ఇప్పించుకున్నాడు . కుల రాకకీయాలు చెయ్యను అన్నాడు , చేస్తున్నాడు . ఎన్ని చెప్పిన ఆకరికి ఎవరైనా కుటుంబానికి దాసోహం కావాల్సిందదే.

Comments are closed.