ఫంకీగా మారిన హీరో

సినిమా ప్రారంభించిన రోజునే టైటిల్ కూడా ప్రకటించి ఆసక్తి రేకెత్తించారు మేకర్స్.

వరుసపెట్టి సినిమాలు లాంచ్ చేస్తున్న విశ్వక్ సేన్, మరో సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమా పేరు ఫంకీ. అనుదీప్ కేవీ ఈ సినిమాకు దర్శకుడు.

దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ తో ఈరోజు ఈ సినిమా అధికారికంగా లాంచ్ అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై రాబోతున్న ఈ సినిమాను పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చెబుతున్నాడు దర్శకుడు.

సినిమా ప్రారంభించిన రోజునే టైటిల్ కూడా ప్రకటించి ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. సంక్రాంతి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

రీసెంట్ గా మెకానిక్ రాకీ రిలీజ్ చేశాడు విశ్వక్ సేన్. చేతిలో లైలా ఉంది. 3 నెలల కిందటే సుధాకర్ చెరుకూరి నిర్మాతగా శ్రీధర్ గంటా దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఫంకీకి కూడా డేట్స్ ఎడ్జెస్ట్ చేయబోతున్నాడు. లిస్ట్ లో సాగర్ చంద్ర సినిమా కూడా ఉంది.

One Reply to “ఫంకీగా మారిన హీరో”

Comments are closed.