ఎక్కడ నుంచో వచ్చి ఉత్తరాంధ్రలోని పూర్తి గ్రామీణ వాసనలతో ఉన్న అనకాపల్లి లోక్ సభకు ఎంపీగా పోటీ చేసి గెలవడం మామూలు విషయం కాదు. దానిని సుసాధ్యం చేసి చూపించారు సీఎం రమేష్. తెలుగుదేశం పార్టీతో దశాబ్దాల బంధం ఉన్నా బీజేపీతో దోస్తీ కట్టి ఆ పార్టీలో చేరి బీజేపీ పెద్దల మనసును గెలుచుకోవడం కూడా రమేష్ కే చెల్లింది అని అంటున్నారు.
ఆయనకు బీజేపీ జాతీయ పెద్దల వద్ద ఉన్న పలుకుబడి చాలా అధికమని అంతా చెబుతారు. అది ఆచరణలో రుజువు అవుతూ వస్తోంది. రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవిగా అంతా చూస్తారు. దానిని సాధించడం కూడా రమేష్ కే చెల్లింది.
ఇప్పుడు ఆయన జమిలి ఎన్నికల మీద సమగ్ర చర్చ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చోటు సంపాదించారు. ఏపీ నుంచి బీజేపీకి ముగ్గురు ఎంపీలు ఉండగా ఒకరు కేంద్ర మంత్రి అయ్యారు. ఇప్పుడు రమేష్ కి ఈ బాధ్యతలు దక్కాయి. ఆయనకే ఇన్ని పదవులు లభిస్తూండంతో కేంద్ర పెద్దల వద్ద రమేష్ కి ఉన్న సాన్నిహిత్యం మీద అంతా తర్కించుకుంటున్నారు.
రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు వచ్చిన రమేష్ ఈ ప్రాంతంలో కూడా తన హవా చాటుతున్నారు. కూటమి తరఫున కీలకంగా వ్యవహరిస్తున్నారు. దాంతో రమేష్ ముందు ముందు మరెన్ని పదవులు అందుకుంటారో అని అంతా చర్చించుకుంటున్నారు. ఆయన ఈ టెర్మ్ లో ఖాయంగా కేంద్ర మంత్రి అయి తీరుతారు అని కూడా పార్టీలో చెబుతున్నారు.
Liquor dongatanam chesi daani business gaa marchukuni , community power tho extended business chesi, last cbn gkvt lo civil projects lo baaga Nokki , sontham gaa airplane supply chese Donga muta nayakudu …Parledu…
kaani veedu valla prajalaki emi upoyogam ledu ippati varaku
Horns are sharper than Ears.